గుజరాత్ 'తొలి దశ'లో 21శాతం మంది 'క్రిమినల్స్'

by Disha Web Desk 7 |
గుజరాత్ తొలి దశలో 21శాతం మంది క్రిమినల్స్
X

గాంధీనగర్: గుజరాత్‌‌లో తొలి దశ అసెంబ్లీ ఎన్నికల్లో 89స్థానాలకు పోలింగ్ జరగనుండగా, మొత్తం 788 మంది బరిలో ఉన్నారు. అయితే, వీరిలో 21శాతం(167) మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇందులోనూ 13శాతం (100)మందిపై హత్య, లైంగికదాడి వంటి తీవ్రమైన నేరాల్లో నిందితులుగా ఉన్నారు. ఈ విషయాన్ని 'అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్'(ఏడీఆర్) గురువారం వెల్లడించింది. ఏడీఆర్ నివేదిక ప్రకారం, 88స్థానాల్లో పోటీ చేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)లో ఎక్కువ మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. మొత్తం 36శాతం మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులతో ఆప్ తొలిస్థానంలో ఉండగా, 31శాతంతో కాంగ్రెస్, 16శాతంతో అధికార బీజేపీ రెండు, మూడు స్థానాల్లో ఉన్నట్టు నివేదిక వివరించింది. కాగా, మొత్తం 182 అసెంబ్లీ స్థానాలున్న గుజరాత్‌కు తొలి దశ(89) ఎన్నికలు వచ్చే నెల 1న జరగనుండగా, రెండో దశ(93) పోలింగ్ అదే నెల 5న జరగనుంది. 8న ఫలితాలు వెలువడనున్నాయి.


Next Story

Most Viewed