మోడీ సర్టిఫికెట్లు PMO చూపించాల్సిన అవసరం లేదు: కోర్టు

by Disha Web Desk 2 |
మోడీ సర్టిఫికెట్లు PMO చూపించాల్సిన అవసరం లేదు: కోర్టు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ డిగ్రీ, పీజీ సర్టిఫికెట్ల అంశంపై గుజరాత్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. మోడీ సర్టిఫికెట్లు పీఎంవో చూపించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. మోడీ డిగ్రీ, పీజీ సర్టిఫికెట్లు చూపించాలని కోరుతూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మోడీ సర్టిఫికెట్లు పీఎంవో చూపించాలని పిటిషన్‌లో కోరారు. దీనిపై శుక్రవారం జస్టిస్ బీరెన్ వైష్ణవ్‌తో కూడిన సింగిల్ బెంచ్ ధర్మాసనం తీర్పు వెల్లడిస్తూ ప్రధాని డిగ్రీ సర్టిఫికెట్లను పీఎంఓ అందించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. పిటిషన్ వేసిన అరవింద్ కేజ్రీవాల్‌కు కోర్టు ఖర్చుల నిమిత్తం రూ.25 జరిమానా విధించింది. ఈ జరిమానాను గుజరాత్ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీలో డిపాజిట్ చేయాలని ఆదేశించింది.

Next Story

Most Viewed