న్యూస్ ఛానెల్స్, ఓటీటీలకు కేంద్రం షాక్.. ఆ యాడ్స్ వేస్తే కఠిన చర్యలు

by Dishafeatures2 |
న్యూస్ ఛానెల్స్, ఓటీటీలకు కేంద్రం షాక్.. ఆ యాడ్స్ వేస్తే కఠిన చర్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలోని వార్త, ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్‌ సంస్థలకు కేంద్ర ఇన్ఫర్మేషర్, బ్రాడ్‌కాస్టింగ్ మంత్రిత్వశాఖ సరికొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఆయా రంగాల్లోని సంస్థలు ఆన్‌లైన్ బెట్టింగ్ ప్లాట్‌ఫార్మ్‌లకు సంబంధించిన ప్రకటనలను ప్రదర్శించవద్దని ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు వార్త వెబ్‌సైట్లు, ఓటీటీ ఫ్లాట్‌ఫార్మ్, ప్రైవేట్ శాటిలైట్ ఛానెల్స్‌, సోషల్ మీడియా సంస్థలకు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. అంతేకాకుండా ఈ విషయంలో ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై సంబంధిత చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకోబడతాయని ప్రైవేట్ శాటిలైట్ టెలివిజన్ ఛానెల్స్ ఆప్ ప్యానెల్ హెచ్చరికలు జారీ చేసింది.

ఈ మార్గదర్శకాల పత్రాలను మంత్రిత్వ శాఖ అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయబడింది. 'ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ బెట్టింగ్ ప్లాట్‌ఫార్మ్, వాటి సంబంధిత ప్రకటనలను ఎట్టిపరిస్థితుల్లో ప్రకటించవద్దని ప్రైవేట్ శాటిలైట్ టెలివిజన్ ఛానెళ్లను కోరుతున్నాం. అంతేకాకుండా ఈ ఛానెళ్లకు సంబంధించిన వెబ్‌సైట్లు లేక ఇతర ఫ్లాట్‌ఫార్మ్‌లలో కూడా బెట్టింగ్‌కు ప్రోత్సహించే విధంగా ఎటువంటి ప్రకటన, వార్త ప్రచురితం కాకూడదు' అని మంత్రిత్వ శాఖ తన ఆదేశాల్లో పేర్కొంది.



Next Story

Most Viewed