అతీక్ సోదరుల హత్యకు ప్రభుత్వమే కారణం: ఓవైసీ

by Disha Web Desk 12 |
అతీక్ సోదరుల హత్యకు ప్రభుత్వమే కారణం: ఓవైసీ
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఉత్తరప్రదేశ్‌లో గ్యాంగ్‌స్టర్, మాజీ ఎంపీ అతీక్ అహ్మద్, అష్రఫ్‌ను ముగ్గురు దుండగులు కాల్చి చంపిన విషయం తెలిసిందే. అతిక్ అహ్మద్ సోదరుల హత్యలపై ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. యూపీలో శాంతిభద్రతల పరిరక్షణలో సీఎం యోగి విఫలమయ్యారనడానికి ఈ ఘటనే నిదర్శనం అన్నారు. అతిక్ అహ్మద్ సోదరుల హత్యలకు ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. అతిక్, అతని సోదరుడు పోలీసు కస్టడీలో ఉండగా చంపబడ్డారని, జేఎస్ఆర్ నినాదాలు కూడా చేశారని పేర్కొన్నారు.

ఎన్‌కౌంటర్ రాజ్‌ని జరుపుకునే వారు కూడా ఈ హత్యకు సమానంగా బాధ్యులన్నారు. హత్యలు జరుపుకునే సమాజంలో నేర న్యాయ వ్యవస్థ వల్ల ఉపయోగం ఏమిటి? అని ప్రశ్నించారు. ఇది కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అని, శాంతిభద్రతలపై ప్రశ్నను లేవనెత్తుతోందని ఓవైసీ విమర్శించారు. ఇటువంటి హత్యల కారణంగా దేశ రాజ్యాంగం, లా అండ్ ఆర్డర్ పై ప్రజలకు విశ్వాసం ఉంటుందా అని ఆయన నిలదీశారు.

Next Story

Most Viewed