'కాక్రోచ్‌’కు పోటీగా దేశంలో కొత్త పార్టీ.. అనౌన్స్ చేసిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి

by Prasad Jukanti |   (  Updated:2026-06-09 10:49:59  IST  )

సోషల్ మీడియాలో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) సంచలనం సృష్టిస్తున్న వేళ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సరికొత్త రాజకీయ పార్టీని ప్రకటించండం ఆసక్తిగా మారింది.

కాక్రోచ్‌’కు పోటీగా దేశంలో కొత్త పార్టీ.. అనౌన్స్ చేసిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సోషల్ మీడియాలో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) సంచలనం సృష్టిస్తున్న వేళ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మార్కండేయ కాట్జూ సరికొత్త రాజకీయ పార్టీని ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.'ఇష్క్ కరో పార్టీ' (IKP) పేరుతో ఆయన సరికొత్త రాజకీయ ప్రస్తానాన్ని ప్రారంభించారు. ఇది కేవలం వ్యంగ్యంగా పెట్టిన పేరు కాదని.. దేశాన్ని పీడిస్తున్న నిరుద్యోగం, పేదరికం, బాలల్లో పౌష్టికాహార లోపం వంటి తీవ్రమైన సమస్యలపై పోరాడటమే ఈ పార్టీ ముఖ్య ఉద్దేశమని ఆయన ఎక్స్ వేదికగా వివరించారు.

‘వాలెంటైన్స్ డే’ తరహా ప్రేమ వ్యవహారం కాదు:

'ఇష్క్ కరో పార్టీ' పేరుతో రాజకీయం ప్రారంభించిన కాట్జూ ఈ విచిత్రమైన పేరు వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. కొత్తగా స్థాపించబడిన 'ఐకేపీ' (ఇష్క్ కరో పార్టీ) ఒక జోక్ అని, లేదా యువతీ యువకుల మధ్య ప్రేమను ప్రోత్సహించే ఒక రకమైన వాలెంటైన్స్ డే తరహా ప్రేమ వ్యవహారం కాదని, దేశంలోని విభిన్న వర్గాల మధ్య ఐక్యతను పెంపొందించే సామాజిక తత్వమని ఆయన వివరించారు. ప్రజలందరూ తమ విభేదాలను పక్కనబెట్టి ఒకటైనప్పుడే దేశ సమస్యలు అంతమవుతాయని ఆయన పేర్కొన్నారు. కాగా, ఈ కొత్త పార్టీలోకి రావాల్సిందిగా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రాకు కాట్జూ బహిరంగంగా ఆహ్వానం పలికారు. ప్రస్తుతం కుల, మత, జాతి ప్రాతిపదికన విభజించబడిపోయామని ఈ చెడును ఎదుర్కొని, మన ప్రజలలో ఐక్యతను పెంపొందించడమే ఐకేపీ లక్ష్యం అన్నారు. కుల, మత, జాతి భేదం లేకుండా మన ప్రజలందరి పట్ల మనకు ప్రేమ (ఇష్క్) ఉండాలని అప్పుడే మన ప్రజలను వారి దయనీయ దుస్థితి నుండి విముక్తి చేయడానికి, ఆధునిక భావాలు గల నాయకుల నేతృత్వంలో మనం ఒక గొప్ప ప్రజా పోరాటాన్ని (జన సంఘర్ష్) చేయగలమన్నారు. ఈ మహత్తర కార్యంలో ఐకేపీ భారత ప్రజలకు మార్గనిర్దేశం చేస్తుందని అదే దీని లక్ష్యం అని తెలిపారు.. ఐకేపీలో చేరడానికి ఆసక్తి ఉన్నవారు [email protected] ను సంప్రదించాలని తెలిపారు. ఇష్క్ కరో పార్టీ పేరు మార్చాలని నెటిజన్లు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన కాట్జూ పేరు మార్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

కాక్రోచ్ పార్టీ తీరుపై కాట్జూ విమర్శలు:

ఇటీవల నీట్ పరీక్షల వివాదంపై జూన్ 6న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ‘కాక్రోచ్ జనతా పార్టీ’, దాని వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే పెద్ద ఎత్తున నిరసన చేపట్టిన వ్యూహాలను కాట్జూ తీవ్రంగా తప్పుబట్టారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న సీజేపీ పార్టీ డిమాండ్ అర్థరహితమన్నారు. ఒకవేళ ఆయన రాజీనామా చేసినా, మరో మంత్రి వస్తారని. తాంతో వ్యవస్థలో వచ్చే మార్పు ఏముంటుందని ప్రశ్నించారు.

చిక్కుల్లో కర్ణాటక సీఎం.. యాపిల్ కొరికి జనంలోకి విసిరేసిన డీకే శివకుమార్

Next Story