- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వాహనదారులకు గుడ్ న్యూస్.. డ్రైవింగ్ లైసెన్స్‌లో భారీ మార్పులు!
డ్రైవింగ్ లైసెన్స్ వాలిడిటీతో పాటు వాహనాలకు పర్మిట్, ఓనర్ షిప్ ట్రాన్స్ ఫర్ విషయంలో కేంద్రం కీలక ప్రతిపాదనలు సిద్ధం చేసిన

దిశ, డైనమిక్ బ్యూరో: వాహనదారులకు ఆర్టీఓ సేవలు (RTO) సులభతరం చేసేందుకు ఇప్పటికే కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర ప్రభుత్వం త్వరలోనే మరో భారీ మార్పుకు శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలుస్తోంది. డ్రైవింగ్ లైసెన్స్‌లో వ్యాలిడిటీలో మార్పులు చేయబోతున్నట్లు తెలుస్తోంది. లైసెన్స్ వ్యాలిడిటీ ప్రస్తుతం 20 ఏళ్లు ఉండగా.. దాన్ని 50 ఏళ్లకు పెంచేందుకు కేంద్రం ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. లైసెన్స్ గడువు పెంపుతో పాటు జారీ ప్రక్రియలో పలు మార్పులు తీసుకురావడం RTO ఆఫీసుల చుట్టూ తిరిగే పని లేకుండా కీలక సేవలను పూర్తిగా ఆన్‌లైన్ చేయాలని కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ యోచిస్తోందని, ప్రస్తుతం ఈ ప్రతిపాదనలపై ఉన్నత స్థాయి చర్చలు జరుగుతున్నాయని ఈ కథనం పేర్కొంది.
ఆన్‌లైన్‍లో ఓనర్‌షిప్ ట్రాన్స్‌ఫర్:
డ్రైవింగ్ లైసెన్స్ గడువు పెంపుతో పాటు ఓనర్ షఇప్ ట్రాన్స్ ఫర్స్ విషయంలో కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. వాహనాల యాజమాన్య హక్కుల బదిలీ (Vehicle Ownership Transfer), పర్మిట్ల పునరుద్ధరణ (Permit Renewals) ప్రక్రియలను వంద శాతం డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారానే పూర్తి చేసేలా మంత్రిత్వ శాఖ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విధానం అమలులోకి వస్తే, వాహనదారులు సెకండ్ హ్యాండ్ వాహనాల క్రయవిక్రయాల కోసం ఆర్టీఓ ఆఫీసులకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఇంటి నుంచే ఆన్‌లైన్ ద్వారా ఓనర్‌షిప్ మార్చుకోవచ్చు. దీనివల్ల ప్రజలకు, రవాణా అధికారులకు సమయం భారీగా ఆదా అవుతుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజలకు రోజువారీ అనుభవాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో ఈ రెండు ప్రతిపాదనలను అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొంది. సేవలు అందుబాటులో ఉండేలా చూస్తూనే, పరిపాలనాపరమైన అడ్డంకులను తగ్గించడంలో డిజిటల్ వ్యవస్థలు సహాయపడగలవని ప్రభుత్వం భావిస్తోంది. సమీప భవిష్యత్తులోనే ఈ మార్పులను అమల్లోకి తీసుకుబోతున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రాలకు ఆదాయానికి నష్టం ఉండదు:
లైసెన్స్ గడువు పెంచడం వల్ల రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయానికి గండిపడుతుందేమో అన్న అనుమానాలను అధికారులు పటాపంచలు చేశారు. లైసెన్స్ పొందడానికి లేదా ఇతర సేవల కోసం వసూలు చేసే రుసుములను ఆన్‌లైన్ సిస్టమ్స్ ద్వారా యథావిధిగా సేకరించవచ్చని స్పష్టం చేశారు. అలాగే ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే డ్రైవర్లకు నెగెటివ్ పాయింట్లు ఇచ్చే వ్యవస్థను తీసుకురాబోతున్నట్లు అధికారులు తెలిపినట్లు ఈ కథనం పేర్కొంది. పాయింట్ల ఆధారంగా వారి లైసెన్స్‌లను సస్పెండ్ చేయడం లేదా రద్దు చేయడం జరుగుతుందని దీనివల్ల నిర్లక్ష్యంగా నడిపే వాహనదారులకు అడ్డుకట్ట వేయవచ్చ అని ఒక ఉన్నతాధికారి తెలిపినట్లు స్పష్టం చేసింది.






