ఆ డేట్ నుంచి ఢిల్లీ రోడ్లపై ఎలక్ట్రిక్, బీఎస్6 బస్సులకు మాత్రమే అనుమతి

by Disha Web Desk 13 |
ఆ డేట్ నుంచి ఢిల్లీ రోడ్లపై ఎలక్ట్రిక్, బీఎస్6 బస్సులకు మాత్రమే అనుమతి
X

న్యూఢిల్లీ: ఈ ఏడాది నవంబర్ 1 నుంచి ఢిల్లీ, ఎన్‌సీఆర్, హరియాణా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లలోని నగరాలు, పట్టణాల మధ్య ఎలక్ట్రిక్, సీఎన్‌జీ, బీఎస్6 డీజిల్ బస్సులు మాత్రమే నడవనున్నాయి. ఈ మేరకు కమీషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్(సీఏక్యూఎం) శుక్రవారం ప్రకటించింది. ఎలక్ట్రిక్ వాహనాలకు మారే లక్ష్యంతో పాటు ఆయా ప్రాంతాల్లో డీజిల్‌తో నడిచే వాహనాల వల్ల ఏర్పడుతున్న వాయు కాలుష్యాన్ని నియంత్రించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సీఏక్యూఎం తెలిపింది.

కాలుష్య స్థాయిలను తగ్గించే ప్రయత్నంలో భాగంగా దేశీయంగా విక్రయిస్తున్న అన్ని వాహనాలు భారత్ స్టేజ్-6 ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా 2020, ఏప్రిల్‌లో కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాణాలు ఉద్గారాల నియంత్రణ, ఇంధన సామర్థ్యం, ఇంజిన్ డిజైన్‌ను మెరుగుపరచడంపై దృష్టి సారిస్తాయి. వాహన తయారీ సంస్థలు ఈ కొత్త నిబంధనలకు అనుగుణంగా వాహనాలను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా చమురు కంపెనీలు ప్రపంచంలోనే పరిశుభ్రమైన ఇంధనంగా పరిగణిస్తున్న బీఎస్6 ప్రమాణాలకు కట్టుబడి ఉండే ఇంధనాన్ని సరఫరా చేస్తాయి.

Next Story

Most Viewed