ఆ నాలుగు వర్గాల పురోగతే భారత అభివృద్ధి: ప్రధాని మోడీ

by Disha Web Desk 12 |
ఆ నాలుగు వర్గాల పురోగతే భారత అభివృద్ధి: ప్రధాని మోడీ
X

న్యూఢిల్లీ: గత పదేళ్లలో తాను చేసిన కృషి వల్ల ప్రజలు తమ ప్రభుత్వంపై అపారమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ప్రజలను ఓటు బ్యాంకు రాజకీయాలతో అభివృద్ధికి దూరం చేసిన గత ప్రభుత్వాలను మోడీ తప్పుబట్టారు. గురువారం వికసిత్ భారత్‌ సంకల్ప్‌ యాత్ర పేరిట దేశవ్యాప్తంగా నిర్వహిస్తోన్న కార్యక్రమంలో ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో వర్చువల్‌గా మాట్లాడిన మోడీ, తనకు పేదలు, యువత, మహిళలు, రైతులు అనే నాలుగు అతిపెద్ద వర్గాలు ఉన్నాయని, వారి పురోగతే భారత్‌ను అభివృద్ధి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా లబ్ధిదారులకు ఉద్దేశించిన సంక్షేమ పథకాలలో మిగిలిన వారిని గుర్తించి, రాబోయే సంవత్సరాల్లో అందజేస్తామని చెప్పారు. మోడీ హామీ మొదలైన చోట ఇతరులను ఆశించే విధానం ముగుస్తుందని మోడీ అభిప్రాయపడ్డారు.

Next Story