మీడియా ముందుకు రాహుల్.. భవిష్యత్ కార్యచరణపై కీలక ప్రకటన?

by Disha Web Desk 19 |
మీడియా ముందుకు రాహుల్.. భవిష్యత్ కార్యచరణపై కీలక ప్రకటన?
X

దిశ, డైనమిక్ బ్యూరో: లోక్ సభ సభ్యుడిగా తనపై అనర్హత వేటు పడిన తర్వాత రాహుల్ గాంధీ తొలిసారి మీడియాతో మాట్లాడబోతున్నారు. శనివారం మధ్యాహ్నం 1 గంటలకు ఆయన మీడియా సమావేశం నిర్వహించబోతున్నారు. దీంతో కోర్టు తీర్పు, లోక్ సభ సెక్రటరీ జనరల్ తీసుకున్న నిర్ణయంపై ఆయన రియాక్షన్ ఎలా ఉండబోతోందనేది ఆసక్తిని రేపుతోంది. అనర్హత వేటు తర్వాత నిన్న ట్విట్టర్ వేదికగా స్పందించిన రాహుల్ గాంధీ తాను దేశం స్వరాన్ని వినిపిస్తున్నానని, ఇందుకోసం ఏ త్యాగానికైనా సిద్ధం అన్నారు. మరో వైపు రాహుల్ గాంధీ విషయంలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై దేశంలోని విపక్షాలు ఏకతాటిపైకి వస్తున్నాయి.

కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కార్యచరణకు సిద్ధం అవుతున్నాయి. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ సైతం న్యాయ నిపుణులతో సంప్రదింపులు సాగిస్తోంది. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయాలు తీసుకుంటోంది. లోక్ సభ తాజా నిర్ణయంతో ఇన్నాళ్లు రాహుల్ గాంధీ ప్రాతినిథ్యం వహించిన వయనాడ్ లోక్ సభ స్థానానికి సైతం ఉప ఎన్నిక జరిగే అవకాశాలు ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడనున్న రాహుల్ ఏం చెప్పబోతున్నారు? ఈ సందర్భంగా తన భవిష్యత్ కార్యచరణను ప్రకటిస్తారా అనేది ఉత్కంఠ రేపుతోంది.

Next Story