బలవంతపు మత మార్పిళ్లతో దేశ భద్రతపై ప్రభావం

by Disha Web Desk 21 |
బలవంతపు మత మార్పిళ్లతో దేశ భద్రతపై ప్రభావం
X

న్యూఢిల్లీ: బలవంతపు మత మార్పిడిలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ చర్యలు తీవ్రమైన అంశమని పేర్కొంది. దేశ భద్రతను, మత స్వేచ్ఛను ప్రభావితం చేస్తాయని తెలిపింది. ఇలాంటి బలవంతపు మతమార్పిడులను అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలియజేస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని అత్యున్నత న్యాయస్థానం కోరింది. దేశంలో బలవంతపు మతమార్పిడిల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో అశ్వని ఉపాధ్యాయ్ పిటిషన్ దాఖలు చేశారు.

దీనిపై జస్టిస్ ఎంఆర్ షా, హిమ కోహ్లిలతో కూడిన బెంచ్ సోమవారం విచారణ చేపట్టింది. బలవంతపు మత మార్పిళ్లు తీవ్రమైన అంశమని, పరిస్థితి ఆందోళనకరంగా మారకముందే కేంద్రం దీనిపై చర్యలు తీసుకోవాలని తెలిపింది. దీనిపై కేంద్రం స్పష్టమైన వైఖరిని తెలియజేయాలని సొలిసిటర్ జనరల్ మెహతాను కోరింది. అందుకు మెహతా కూడా సానుకూలంగా స్పందించారు. దీనికి గానూ ఈ నెల 22లోపు కేంద్రానికి కోర్టు గడువు ఇచ్చింది. అంతేకాకుండా కేసు విచారణను 28కు వాయిదా వేసింది.


Next Story

Most Viewed