50 ఏళ్లుగా వెలుగుతున్న అమర జవాన్ జ్యోతికి స్థాన చలనం

by Web Desk |
50 ఏళ్లుగా వెలుగుతున్న అమర జవాన్ జ్యోతికి స్థాన చలనం
X

న్యూఢిల్లీ: చర్చనీయాంశంగా మారిన అమర్ జవాన్ జ్యోతిని కేంద్రం జాతీయ యుద్ధ స్మారక జ్యోతిలో విలీనం చేసింది. శుక్రవారం జరిగిన మిలిటరీ వేడుకల్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇండియన్ గేట్ నుంచి వేడుకగా 400 మీటర్ల దూరంలో ఉన్న నూతన స్మారకానికి తీసుకువెళ్లారు. ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ ఎయిర్ మార్షల్ బీఆర్ కృష్ణ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిని చారిత్రక ఘట్టం గా కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. కాగా, అమర్ జవాన్ జ్యోతిని సైనికుల త్యాగాలకు గుర్తుగా ఇండియా గేట్ వద్ద నిలిపారు. 1971లో పాకిస్తాన్ పై బంగ్లాకు మద్దతుగా భారత్ గెలుపుకు చిహ్నంగా అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దీన్ని వెలిగించారు. అప్పటినుంచి ఈ జ్యోతి నిరంతరాయంగా వెలుగుతూనే ఉంది.

ఈ క్రమంలో 2019లో మిలటరీ వేడుకలు నిర్వహణ, నివాళులు అర్పించడం, ఇతర అధికార కార్యక్రమాలకు గానూ కేంద్రం జాతీయ యుద్ధ స్మారకాన్ని నిర్మించింది. ఆ తర్వాత చాలా కార్యక్రమాలకు ఇదే వేదికగా నిలుస్తూ వచ్చింది. దీంతో కేంద్రం ఇండియన్ గేట్ వద్ద ఉన్న జ్యోతిని తరలించేందుకు సిద్ధమైంది. పలువురు విపక్ష నేతలు, మాజీ సైనికులు కూడా కేంద్ర వైఖరి పై విమర్శలు చేస్తూ ట్వీట్లు చేశారు. దీనిపై స్పందించిన కేంద్రం అమర్ జీవన్ జ్యోతి ఆర్పి వేయడం లేదు. దీనిని జాతీయ యుద్ధ స్మారక జ్యోతి లో విలీనం చేస్తున్నాం. అమర్ జవాన్ జ్యోతి వద్ద జ్వాల ఇతర యుద్ధాల అమరవీరులకు నివాళులు అర్పించడం విచిత్రంగా ఉంది. కానీ అక్కడ వారి పేర్లు ఏవీ లేవు. అని అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వం పై తప్పుడు సమాచారం వ్యాప్తి చెందుతుందని పేర్కొన్నాయి.

Next Story

Most Viewed