రెండు బస్సులు ఢీ.. అక్కడికక్కడే ఐదుగురు దుర్మరణం

by Disha Web Desk 2 |
రెండు బస్సులు ఢీ.. అక్కడికక్కడే ఐదుగురు దుర్మరణం
X

దిశ, డైనమిక్ బ్యూరో: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రభుత్వ, ప్రైవేటు బస్సులు ఢీ కొట్టిన ఘటనలో ఇద్దరు డ్రైవర్లతో సహా ఐదుగురు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు. మరో 40 మందికి పైగా గాయపడ్డారు. శనివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. బెంగళూరు నుంచి చెన్నై వెళ్తున్న తమిళనాడుకు చెందిన ప్రభుత్వ బస్సు తిరుపత్తూరు జిల్లా చెట్టియనూరు వంతెనపై చెన్నై నుంచి బెంగళూరు వస్తున్న మరో బస్సును ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని వేలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రులలో పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Next Story

Most Viewed