- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- వైరల్
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- IPL2023
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- ఆరోగ్యం
- ఫోటోలు
- Job Notifications
- OTT Release
- భక్తి
కొత్తగా ఐదుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం
by Disha Web |

X
దిశ, వెబ్‌డెస్క్: నూతనంగా ఐదుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు. గత వారం సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల నియామకానికి కేంద్రం అనుమతిచ్చింది. ఐదుగురు న్యాయమూర్తులతో సోమవారం భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డీవై చంద్రచూడ్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో జస్టిస్‌లు పంకజ్ మిథాల్, సంజయ్ కరోల్, పీవీ సంజయ్ కుమార్, అహ్సానుద్దీన్ అమానుల్లా, మనోజ్ మిశ్రాలు ప్రమాణం చేశారు. డిసెంబరులో వీరి ఎలివేషన్‌ను కొలీజియం సిఫార్సు చేసింది. ఇవాళ జడ్జీల ప్రమాణ స్వీకారంతో సుప్రీంకోర్టులో జడ్జిల సంఖ్య సీజేఐతో కలిపి 32 కు చేరింది. సుప్రీంకోర్టులో వాస్తవంగా 34 మంది జడ్జీలు ఉండాల్సి ఉంది. గత ఏడాది డిసెంబర్ 13న కొలీజియం పంపిన సిఫారసులను కేంద్రం గతవాంతం ఆమోద ముద్ర వేసిన సంగతి తెలిసిందే.
Next Story