నేడు జమిలి కమిటీ తొలి భేటీ.. చర్చించే అంశాలపై ఉత్కంఠ!

by Disha Web Desk 4 |
నేడు జమిలి కమిటీ తొలి భేటీ.. చర్చించే అంశాలపై ఉత్కంఠ!
X

దిశ, వెబ్‌డెస్క్: మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ నేతృత్వంలో ‘వన్ నేషన్ - వన్ ఎలక్షన్’ కమిటీ నేడు తొలి సారి భేటీ కానుంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నిక ఒకేసారి జరిపే అంశంలో రోడ్ మ్యాప్ ను ఈ భేటీలో రెడీ చేయనున్నారు. ఇందుకు సంబంధించి రాజకీయ పార్టీలు, ఎక్స్ పర్ట్స్ సలహాలు తీసుకోనున్నారు. ఈ మేరకు నిన్న ఒడిశా పర్యటనలో ఉన్న రాంనాథ్ కోవింద్ భేటీ వివరాలను వెల్లడించారు. జమిలి కమిటీలో సభ్యులుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ పార్టీ మాజీ నాయకుడు గులాం నబీ ఆజాద్, ఎన్ కే సింగ్, సుభాష్ సి. కశ్యప్, హరీష్ సాల్వే, సీవీసీ సంజయ్ కొఠారి ఉన్న విషయం తెలిసిందే.

Next Story

Most Viewed