BJP లోక్‌సభ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ విడుదల.. కీలక నేతలకు SHOCK

by Disha Web Desk 2 |
BJP లోక్‌సభ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ విడుదల.. కీలక నేతలకు SHOCK
X

దిశ, వెబ్‌డెస్క్: భారతీయ జనతా పార్టీ(BJP) లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. ఢిల్లీలోని కేంద్ర కార్యాయంలో ఆ పార్టీ జనరల్ సెక్రటరీ వినోద్ తావడే 195 మందితో కూడిన అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. అందరూ అనుకున్న విధంగా తొలి జాబితాలో గెలుపు గుర్రాలకే ప్రాధాన్యత ఇచ్చారు. అనేక స్థానాల్లో కీలక నేతలకు మొండిచేయి చూపించారు. ఈ సారి జాబితా గతానికి భిన్నంగా ప్రిపేర్ చేశారు. వయసు మీదపడిన నేతలకు, మూడు, అంతకంటే ఎక్కువసార్లు పోటీ చేసిన నేతలకు చెక్ పెట్టారు.

కొత్త తరానికి అవకాశాలు కల్పిస్తూ చాలా నియోజకవర్గాల్లో కీలక మార్పులు చేశారు. వారణాసి నుంచి ప్రధాని మోడీ, గాంధీ నగర్ నుంచి అమిత్ షా, లక్నో నుంచి రాజ్‌నాథ్ సింగ్ పోటీ చేయనున్నారు. తెలంగాణలో.. సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అర్వింద్ సహా మొత్తం తొమ్మిది మంది అభ్యర్థిత్వం ఖరారైంది. తొలి జాబితాలో 28 మంది మహిళలు, 47 మంది యువకులు, 27 ఎస్సీ, 57 ఓబీసీలు, ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు, 34 మంది కేంద్ర మంత్రులకు అవకాశం కల్పించారు. అభ్యర్థుల జాబితా కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి. https://epaper.dishadaily.com/3837332/TSdynamicnew/BJP#page/1/1

తెలంగాణ లోక్‌సభ అభ్యర్థులు:

1. కిషన్ రెడ్డి = సికింద్రాబాద్

2. బండి సంజయ్ = కరీంనగర్

3. ధర్మపురి అర్వింద్ = నిజామాబాద్

4. కొండా విశ్వేశ్వర్ రెడ్డి = చేవెళ్ల

5. బూర నర్సయ్య గౌడ్ = భువనగిరి

6. పి. భరత్ = నాగర్ కర్నూలు

7. బీబీ పాటిల్ = జహీరాబాద్

8. ఈటల రాజేందర్ = మల్కాజ్‌గిరి

9. మాదవీలత = హైదరాబాద్

Next Story

Most Viewed