HD Kumaraswamy: కేంద్రమంత్రి హెచ్డీ కుమారస్వామిపై కేసు నమోదు

by Shamantha N |
HD Kumaraswamy: కేంద్రమంత్రి హెచ్డీ కుమారస్వామిపై కేసు నమోదు
X

దిశ, నేషనల్ బ్యూరో: కేంద్ర మంత్రి హెచ్‌డి కుమారస్వామిపై(Union Minister HD Kumaraswamy) కేసు నమోదైంది. ఆయనతో పాటు, ఆయన కుమారుడు నిఖిల్ కుమారస్వామి, జేడీ(ఎస్) ఎమ్మెల్యే సురేష్ బాబుపై ఎఫ్ఐఆర్ నమోదైంది. తనను బెదిరించారని సీనియర్ అధికారి చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ప్రభుత్వ ఉద్యోగిని బెదిరించి విధులు నిర్వర్తించకుండా అడ్డుకున్నారని అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ADGP) ఎం చంద్రశేఖర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. నవంబర్ 4న బెంగళూరులోని సంజయ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో చంద్రశేఖరన్ ఫిర్యాదు చేయడంతో.. అధికారులు కేసు నమోదు చేశారు.

మైనింగ్ స్కాం

కుమారస్వామి నిందితుడిగా ఉన్న స్కాం కేసు దర్యాప్తు చేసే ప్రత్యేక దర్యాప్తు బృందానికి చంద్రశేఖర్ నేతృత్వం వహిస్తున్నారు. 2006 నుంచి 2008 వరకు కుమారస్వామి కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చట్టాన్ని ఉల్లంఘించి బళ్లారి జిల్లాలోని శ్రీ సాయి వెంకటేశ్వర మినరల్స్ (SSVM)కి 550 ఎకరాల మైనింగ్ అక్రమగా లీజుకు ఇచ్చారనే ఆరోపణలు వచ్చాయి. ఈ కేసుపైనే చంద్రశేఖర్ దర్యాప్తు చేస్తున్నారు. అయితే, కేసు దర్యాప్తు చేపట్టకుండా కుమారస్వామి బెదిరించినట్లు ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనపై, తన కుటుంబంపై కుమారస్వామి బెదిరింపు వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా కుమారస్వామిపై ప్రాసిక్యూషన్ కు అనుమతి కోరుతూ గతంలో గవర్నర్ కు కర్ణాటక ప్రభుత్వం లేఖ రాసినట్లు తెలిపారు. తనను భయపెట్టేందుకే కుమారస్వామి, ఆయన కుమారుడు నిఖిల్ తనపై ఆరోపణలు చేశారని ఏడీజీపీ ఆరోపించారు. కర్ణాటక కేడర్ అధికారిగా కొనసాగేందుకు తాను నకిలీ మెడికల్ రికార్డులు సంపాదించినట్లు వారు ఆరోపణలు చేశారన్నారు. అయితే, ఈ ఆరోపణలపై కేంద్ర మంత్రి కుమారస్వామి స్పందించారు. ఆ ఫిర్యాదు "హాస్యాస్పదమైనది, ప్రమాదకమైనది" అని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed