ఆ విషయంలో రైతులను విలన్లను చేయద్దు: సుప్రీంకోర్టు

by Disha Web Desk 17 |
ఆ విషయంలో రైతులను విలన్లను చేయద్దు: సుప్రీంకోర్టు
X

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ, పంజాబ్‌లలో ప్రతి ఏడాది పెరుగుతున్న కాలుష్యంపై ఆయా రాష్ట్రాల్లో ఆప్ ప్రభుత్వాలను సుప్రీంకోర్టు మంగళవారం తప్పుబట్టింది. ఈ అంశంపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌లపై జరిగిన విచారణలో పంజాబ్ రాష్ట్రంలో పంట వ్యర్థాలను దగ్ధం గురించి ఆ రాష్ట్రం ఇచ్చిన నివేదిక విషయంలో అత్యున్నత న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. ఈ విషయంలో రైతులను విలన్లుగా ఎందుకు చూపిస్తున్నారు, గత ఆరేళ్లలో ఇదే అత్యంత కాలుష్యం బారిన పడిన సందర్భం ఇది. సమస్య తెలిసినపుడు పంట వ్యర్థాలను కాల్చడాన్ని నియంత్రించడం మీ పని. మీరు ఎలా చేయాలో చెప్పడం కోర్టు పని కాదు. మీ పని మీరు చేసేలా చూడటం కోర్టు పని అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.

ప్రతిసారి రైతులనే విలన్లుగా చూపాలనే ప్రయత్నం కనిపిస్తోంది. కోర్టు వారిని విచారించడం లేదు. పంట వ్యర్థాలను కాల్చేందుకు రైతులకు ఉండే కారణాలు వారికి ఉంటాయి. పేద రైతులకు పంట వ్యర్థాల నాశనానికి కావాల్సిన యంత్రాల కోసం నిధులను ఎందుకు అందుబాటులో ఉంచడంలేదని ప్రశ్నించింది. ఈ అంశంలో హర్యానా ప్రభుత్వం నుంచి సలహాలు తీసుకోండి, అక్కడి ప్రభుత్వం రైతులు పంట వ్యర్థాలు కాల్చకుండా ప్రోత్సాహకాలు ఇస్తోందని సుప్రీంకోర్టు సూచించింది.

Next Story