కేంద్ర ప్రభుత్వ ఫెయిల్యూర్ వల్లే పేలుడు : ఖర్గే

by Muthe.Rajitha |

కేంద్ర ప్రభుత్వ ఫెయిల్యూర్ వల్లే ఢిల్లీలో పేలుడు జరిగిందని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే తీవ్ర ఆరోపణలు చేశారు.

కేంద్ర ప్రభుత్వ ఫెయిల్యూర్ వల్లే పేలుడు : ఖర్గే
X

దిశ, వెబ్ డెస్క్ : కేంద్ర ప్రభుత్వ ఫెయిల్యూర్ వల్లే ఢిల్లీలో పేలుడు జరిగిందని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని ఖర్గే డిమాండ్ చేశారు. దేశ రాజధాని నగరంలో ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని.. ఇందులో కేంద్ర నిఘా సంస్థల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని మండిపడ్డారు. ఇంటెలిజెన్స్ బ్యూరో, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో వంటి అత్యున్నత ఏజెన్సీలు ఉన్నప్పటికీ.. కేంద్ర ప్రభుత్వం విఫలం అయిందని విమర్శించారు. దర్యాప్తు సంస్థల నివేదికలు వచ్చాక మేం కేంద్రాన్ని మరింత నిలదీస్తామని ఖర్గే మీడియాకు తెలిపారు.

Next Story