మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు.. ప్రారంభమైన కౌంటింగ్

by Disha Web Desk 4 |
మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు.. ప్రారంభమైన కౌంటింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ లో ఎన్నికల ఫలితాలు నేడు తేలనున్నాయి. బీజేపీ పాలిత త్రిపురలో ఫిబ్రవరి 16న పోలింగ్ జరిగింది. మేఘాలయ, నాగాలాండ్ లో ఫిబ్రవరి 27న ఎన్నికలు జరిగాయి. మూడు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదు అయింది. త్రిపురలో 86 శాతం పోలింగ్ నమోదైంది. నాగాలాండ్, మేఘాలయలో 81 శాతం పోలింగ్ నమోదైంది.

కాగా ఎగ్జిట్ పోల్స్ మేఘాలయలో హంగ్ ఏర్పడుతుందని తేల్చాయి. కాండ్రాడ్ సాంగ్మా నేతృత్వంలోని ఎన్ పీపీ అధికారం నిలబెట్టుకుంటుదని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. త్రిపురలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. ఈ మూడు రాష్ట్రాల్లో 60 చొప్పున అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. నాగాలాండ్, మేఘాలయాల్లో ఒక్కో అసెంబ్లీ సీటు ఇప్పటికే ఏకగ్రీవం అయ్యాయి. త్రిపురలో 60 స్థానాలకు 259 మంది, మేఘాలయాలో 59 స్థానాలకు 369 మంది, నాగాలాండ్ లో 59 సీట్లకు 183 మంది పోటీ పడ్డారు.



Next Story

Most Viewed