'పురాణాలు చదివుంటే ఆయన కామెంట్స్‌పై మౌనమెందుకు?'.. రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి ఫైర్

by Vinod kumar |
పురాణాలు చదివుంటే ఆయన కామెంట్స్‌పై మౌనమెందుకు?.. రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి ఫైర్
X

న్యూఢిల్లీ : ఉపనిషత్తులు, భగవద్గీత చదివానని చెబుతున్న రాహుల్‌ గాంధీ.. సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే ఎందుకు మౌనం వహించారని కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ ప్రశ్నించారు. సనాతన ధర్మానికి జరిగిన అవమానంపై ఇప్పటికైనా మౌనం వీడాలని కోరారు. దేశం పేరుకు సంబంధించిన వివాదంలో రాహుల్‌ గాంధీ పదేపదే అబద్ధాలు చెప్పి ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.

‘‘శివసేన వ్యవస్థాపకులు బాల్ థాక్రే ఇప్పుడు ఉండుంటే ఎలా ఆలోచించేవారో చెప్పలేను కానీ.. ప్రస్తుతం ఉద్ధవ్‌ థాక్రే మాత్రం అధికార దాహంతో ముందుకు సాగుతున్నారు. ఉదయ నిధి కామెంట్స్‌పై రాహుల్‌, ఉద్ధవ్‌ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. వాళ్లిద్దరూ సనాతన ధర్మాన్ని అవమానించడానికే పరిమితం అవుతున్నారు’’ అని కేంద్ర మంత్రి విమర్శించారు. అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా గోద్రా వంటి ఘటనలు చోటు చేసుకుంటాయని ఉద్ధవ్‌ థాక్రే చేసిన వ్యాఖ్యలను అనురాగ్‌ తప్పుపట్టారు.

Next Story

Most Viewed