- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
'బీజేపీకి అనుగుణంగా ఈడీ, సీబీఐ.. అందులో అరెస్టైన వారు 95 శాతం ప్రతిపక్షాలే.. '

దిశ, వెబ్‌డెస్క్: భారత మాజీ ఆర్థిక మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పి. చిదంబరం ప్రతిపక్ష నేతలపై కేంద్ర ఏజెన్సీల దాడులకు బీజేపీపై విరుచుకుపడ్డారు. దేశంలో ఈడీ, సీబీఐ సంస్థలు బీజేపీ ఆదేశాల మేరకు పనిచేస్తున్నాయని, అలాంటి ఏజెన్సీల ద్వారా అరెస్టు చేయబడిన వారిలో 95 శాతం మంది ప్రతిపక్ష నాయకులేనని చిదంబరం ఆరోపించారు. గుజరాత్‌ను ఢిల్లీ నుంచి పరిపాలిస్తున్నారు తప్ప.. గుజరాత్‌లో ఉన్న ముఖ్యమంత్రి కాదని విమర్శించారు. మరోవైపు మోబి బ్రిడ్జి కూలిన ఘటనపై బీజేపీ నేతలు ఎవరూ క్షమాపణలు చెప్పకపోవడం లేదా రాజీనామా చేయకపోవడం దిగ్భ్రాంతికరమని అన్నారు. ఇదిలావుండగా.. మోర్బీ వంతెన కూలిన దుర్ఘటనలో గుజరాత్ హైకోర్టు సోమవారం సుమోటోగా విచారణ చేపట్టి రాష్ట్ర ప్రభుత్వానికి, స్థానిక అధికారులకు నోటీసులు జారీ చేసింది. నవంబర్ 14 లోగా దీనిపై స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని కూడా హైకోర్టు కోరింది.
ఇవి కూడా చదవండి : మునుగోడులో ఓటమిపై మరోసారి కేఏపాల్ సంచలన వ్యాఖ్యలు