హేమ మాలినిపై అనుచిత వ్యాఖ్యలతో రణదీప్ సూర్జేవాలాకు ఈసీ షోకాజ్ నోటీసులు

by Dishanational1 |
హేమ మాలినిపై అనుచిత వ్యాఖ్యలతో రణదీప్ సూర్జేవాలాకు ఈసీ షోకాజ్ నోటీసులు
X

దిశ, నేషనల్ బ్యూరో: బీజేపీ ఎంపీ హేమామాలినిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత రణదీప్ సూర్జేవాలాకు ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్ 11 సాయంత్రంలోపు వివరణ ఇవ్వాలని ఈసీ పేర్కొంది. పార్టీ నాయకులందరూ బహిరంగంగా మాట్లాడే సమయంలో మహిళల గౌరవాన్ని నిలబెట్టేలా, ఈ విషయాలను పాటించేలా పార్టీ తీసుకున్న చర్యలకు సంబంధించి ఎన్నికల సంఘం కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే నుంచి సైతం వివరణను కోరింది. ఖర్గేకు రణదీప్ వివరణ ఇచ్చిన తర్వాతి రోజు సాయంత్రం వరకు గడువు ఇచ్చింది. హేమామాలిని ఉత్తరప్రదేశ్‌లోని మధుర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఇటీవల హేమమాలినిపై కాంగ్రెస్ నేత రణదీప్ సూర్జేవాలా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ ఒక వీడియోను బీజేపీ పోస్టు చేసింది. మహిళలను కించపరిచేలా మాట్లాడుతున్నారంటూ బీజేపీ ధ్వజమెత్తింది. ఈ వ్యాఖ్యలు మహిళలందరినీ అవమానించేలా ఉన్నాయని పేర్కొంది. అయితే బీజేపీ విమర్శలను కాంగ్రెస్ ఖండించింది. తన ప్రసంగంలోని కొన్ని మాటలను తీసుకుని వక్రీకరిస్తున్నారని, పూర్తి ప్రసంగాన్ని చూడాలని రణదీప్ సూర్జేవాలా మరో వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. హేమమాలినిని ఎంతో గౌరవిస్తామని, ఆమె ధర్మేంద్రను వివాహం చేసుకున్నారని గుర్తుచేశారు. అంతేకాకుండా ఆమె మా ప్రాంత కోడలు అని.. ఎవరినీ కించపరిచే ఉద్దేశం లేదని సూర్జేవాల పేర్కొన్నారు.



Next Story

Most Viewed