బెయిల్‌పై బయటున్నవాళ్లు ప్రధాని మోడీని జైలుకు పంపుతామంటున్నారు: రాజ్‌నాథ్ సింగ్

by Dishanational1 |
బెయిల్‌పై బయటున్నవాళ్లు ప్రధాని మోడీని జైలుకు పంపుతామంటున్నారు: రాజ్‌నాథ్ సింగ్
X

దిశ, నేషనల్ బ్యూరో: జైల్లో ఉండి, బెయిల్‌పై ఉన్నవారు ప్రధాని నరేంద్ర మోడీని జైలుకు పంపాలని మాట్లాడుతున్నారని ఆర్జేడీ అధినేత లాలూ యాదవ్ కుమార్తె మిషా భారతీపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఘాటుగా విమర్శలు చేశారు. అలాగే లాలూ కుమారుడు తేజస్వి యాదవ్‌ను ఉద్దేశిస్తూ.. ఆర్జేడీ నేతలు కొందరు నవరాత్రి సీజన్‌లో ఒక వర్గం ఓటర్ల కోసం నాన్-వెజిటేరియన్స్ ఫోటోలను పోస్ట్ చేస్తున్నారని విమర్శించారు. బీహార్‌లోని జముయిలో జరిగిన పార్టీ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. తేజస్వి నవరాత్రి సీజన్‌లో చేపలు తిన్నారు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా ఎటువంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? చేప, పంది, ఏనుగు, గుర్రం, పావురం ఏదైనా తినండి. వాటిని అందరికీ చూపించాల్సిన అవసరం ఏముంది. ఓట్ల కోసం, బుజ్జగింపు రాజకీయాల కోసమే కదా ఇదంతా. ఒక మతానికి చెందినవారు ఓట్లు వేస్తారనే ఆలోచన నుంచి ఇలాంటి చర్యలు మొదలవుతాయి. ఇటువంటి నేతలకు లాలూజీ సరిద్దారలని కోరుతున్నానని ' రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. నరేంద్ర మోడీ మూడోసారి ప్రధాని అవుతారని ప్రపంచమంతా భావిస్తోంది. చాలా దేశాల నుంచి మోడీకి ఆహ్వానాలు కూడా వస్తున్నాయని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. కాగా, ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా తేజస్వి యాదవ్ చేపల ఆహారం తింటున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నవరాత్రి ప్రారంభమైన నేపథ్యంలో సదరు వీడియోను బీజేపీ ఖండించింది. సనాతన ధర్మాన్ని పాటిస్తామని చెప్పే తేజస్వి యాదవ్ ఇలాంటి రాజకీయాలు చేస్తున్నారని విమర్శించింది.

Next Story

Most Viewed