బిగ్ బ్రేకింగ్: ఢిల్లీలో భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం

by Disha Web Desk 19 |
బిగ్ బ్రేకింగ్: ఢిల్లీలో భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం రాత్రి భూ ప్రకంపనలు కలకలం రేపాయి. నోయిడాతో పాటు పలు ప్రాంతాల్లో భూమి ఒక్కసారిగా కంపించింది. దీంతో ఏం జరగుతోందో అర్థం కాక ప్రజలు భయంతో ఇండ్లలో నుండి బయటకు పరుగులు తీశారు. ఢిల్లీలోని ఏపీ, తెలంగాణ భవన్ వద్ద కూడా భూమి కంపించడంతో జనం తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఢిల్లీ సహా పలు ఉత్తరాది రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో భూమి కంపించడంతో ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. ఒక్కసారిగా భూమి కంపించడంతో భయంతో ఇళ్లను వీడి జనం బహిరంగ ప్రదేశాలకు పరుగులు పెట్టారు. జమ్మూ కాశ్మీర్‌లో భూకంపం కారణంగా పలు ప్రాంతాల్లో కమ్యూనికేషన్ దెబ్బతింది.

Next Story