ఫుల్లుగా తాగి నడిరోడ్డుపై బీభత్సం సృష్టించిన యువతులు..

by Disha Web Desk 6 |
ఫుల్లుగా తాగి నడిరోడ్డుపై బీభత్సం సృష్టించిన యువతులు..
X

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల కాలంలో పురుషులే కాదు అమ్మాయిలు కూడా మద్యం తాగుతూ రోడ్లపై రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి ఘటనలు వార్తల్లో చాలానే చూస్తున్నాం. తాజాగా, చెన్నై లోని తిరువల్లిక్కేణిలో కొంత మంది యువతులు శనివారం రాత్రి ఫుల్లుగా తాగి నడిరోడ్డుపై కూర్చుని వచ్చిపోయే వాహనాలను నిలిపివేశారు. అంతేకాకుండా ఓ బస్సును ఆపి అది ముందుకు వెళ్లకుండా దాని కింద పడుకున్నారు. దీంతో ఆ ప్రదేశంలో ట్రాఫిక్ జామ్ అవ్వడంతో వాహనదారులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని యువతులను అదుపులోకి తీసుకొచ్చి అతికష్టం మీద స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Next Story

Most Viewed