ఎన్నికల వేళ రూ.1,760 కోట్ల విలువైన నగదు, మద్యం స్వాధీనం: ఎన్నికల సంఘం

by Harish |
ఎన్నికల వేళ రూ.1,760 కోట్ల విలువైన నగదు, మద్యం స్వాధీనం: ఎన్నికల సంఘం
X

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు భారీ మొత్తంలో నగదు, మద్యం సరఫరా జరుగుతోంది. తాజాగా ఐదు రాష్ట్రాల్లోనూ కలిపి సుమారు రూ. 1,760 కోట్లకు పైగా విలువైన ఉచిత వస్తువులు, డ్రగ్స్, నగదు, మద్యం, విలువైన లోహాలను స్వాధీనం చేసుకున్నట్టు భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) సోమవారం ప్రకటించింది.

అక్టోబర్ 9న ఎన్నికల తేదీలను ప్రకటించినప్పటి నుంచి లభ్యమైన ఈ మొత్తం 2018లో ఇవే రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్వాధీనం చేసుకున్న మొత్తం కంటే ఏడు రెట్లు(630 శాతం) ఎక్కువని పోల్ ప్యానెల్ వెల్లడించింది. 2018లో ఎన్నికల సంఘం రూ. 239.15 కోట్ల అక్రమ నగదును స్వాధీనం చేసుకుంది. నవంబర్ 30న ఎన్నికల జరగాల్సిన తెలంగాణలో అత్యధికంగా రూ. 659.2 కోట్ల నగదు పట్టుబడగా, రాజస్థాన్‌లో రూ. 650.7 కోట్లు, మధ్యప్రదేశ్‌లో రూ. 323.7 కోట్లు, ఛత్తీస్‌గఢ్‌లో రూ. 76.9 కోట్లు, మిజోరంలో రూ. 49.6 కోట్లను స్వాధీనం చేసుకున్నట్టు ఈసీఐ పేర్కొంది.



Next Story

Most Viewed