అదానీ, యూఏఈ ఎడ్జ్ గ్రూప్ మధ్య ఒప్పందం

by Shamantha N |
అదానీ, యూఏఈ ఎడ్జ్ గ్రూప్ మధ్య ఒప్పందం
X

దిశ, నేషనల్ బ్యూరో: అదానీ డిఫెన్స్ & ఏరోస్పేస్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కి చెందిన ఎడ్జ్ గ్రూప్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇక నుంచి రెండు సంస్థలు సంయుక్తంగా క్షిపణులు, ఆయుధాలను అభివృద్ధి చేయనున్నాయి. దీనివల్ల భారత్, యూఏఈ లలో ఆర్ అండ్ డీ సౌకర్యాలను సృష్టించేందుకు కృషి చేయనున్నారు. డిఫెన్స్, ఏరోస్పేస్ సామర్థ్యాలను ప్రభావితం చేసే గ్లోబల్ ప్లాట్‌ఫారమ్‌ను రూపొందించడమే ఈ ఒప్పందం లక్ష్యం. ఇకపోతే, ఎడ్జ్ గ్రూప్ ప్రపంచంలోనే అతిపెద్ద అధునాతన సాంకేతిక రక్షణ సంస్థగా పేరుగాంచింది. ఎడ్జ్ గ్రూపులో 25 కంపెనీలు ఉన్నాయి. సైనిక, పౌర రంగాలకు సంబంధించిన సాంకేతికతలను ఉత్పత్తి చేస్తుంది. ఎడ్జ్ గ్రూప్ ప్రపంచంలోని ఆయుధ తయారీ కంపెనీల్లో టాప్ 3 స్థానంలో ఉంది.

ద్వైపాక్షిక రక్షణ సహకారం

ఈ ఒప్పందం గురించి అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ సీఈవో ఆశిష్ రాజ్‌వంశీ మాట్లాడారు. రక్షణ సామర్థ్యాలకు సంబంధించిన కొత్త టెక్నాలజీల అభివృద్ధికి ఈ ఒప్పందంతో నాంది పలికామన్నారు. భారత్, యూఏఈ మధ్య అధునాతన సాంకేతిక పురోగతి, ద్వైపాక్షిక రక్షణ సహకారం సాధ్యమవుతుందన్నారు. డిఫెన్స్, ఏరోస్పేస్ రంగంలో అత్యాధునిక ఆవిష్కరణలు చేసి.. ప్రపంచ మార్కెట్ లో బెంచ్‌మార్క్‌ను సెట్ చేస్తామన్నారు.

Next Story

Most Viewed