ఘోర రోడ్డు ప్రమాదం.. ఎంపీ కొడుకు స్పాట్ డెడ్

by samatah |
ఘోర రోడ్డు ప్రమాదం.. ఎంపీ కొడుకు స్పాట్ డెడ్
X

దిశ, వెబ్‌డెస్క్ : డీఎంకే రాజ్యసభ సభ్యుడు ఎన్‌ఆర్ ఇళంగోవన్ కుమారుడు రాకేశ్ గురువారం రోజు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్లితే.. ఎంపీ ఇళంగోవన్ కుమారుడు రాకేశ్ తన మిత్రునితో కలసి పుదుచ్చేరి వెళ్తున్న క్రమంలో కారుడు డివైడర్‌ను ఢీ కొంది. ఈ ప్రమాదంలో ఎంపీ కుమారుడు అక్కడిక్కడే మృతి చెందగా ఆయన మిత్రుడు తీవ్రగాయాలతో బయటపడ్డాడు. ఇక స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్రేన్ సహాయంతో కారును తొలిగించారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Next Story