- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
డేరాబాబాకు 21 రోజుల పెరోల్.. 21 నెలల్లో ఆరోసారి
by Disha Web Desk 17 |

X
ఛండీగఢ్: రెండు హత్యల కేసుల్లో యావజ్జీవ జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్‌కు హర్యానా ప్రభుత్వం 21 రోజుల పెరోల్‌ను మంజూరు చేసింది. గత 21 నెలల్లో ఆయన జైలు నుంచి పెరోల్‌పై విడుదల కావడం ఇది ఆరోసారి. డేరా బాబాకు తరుచూ పెరోల్ దొరుకుతుండటం వివాదాస్పదమవుతోంది. అయితే ఇందులో తమ ప్రమేయం ఉండదని, జైలు నిబంధనలకు అనుగుణంగా అధికారులే తగిన నిర్ణయం తీసుకుంటారని హర్యానా సర్కారు స్పష్టం చేస్తోంది.
గతంలో హర్యానా పంచాయతీ ఎన్నికలు, ఆదంపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికలకు ముందు 45 రోజుల పెరోల్‌పై గుర్మీత్ విడుదలయ్యారు. తల్లికి అనారోగ్యం కారణంగా ఆయనకు రెండు సార్లు పెరోల్ వచ్చింది. ఇద్దరు మహిళా అనుచరులపై అత్యాచారం చేసిన కేసుతో పాటు మేనేజర్ రంజిత్ సింగ్ హత్య కేసులో డేరా బాబాను కోర్టు దోషిగా నిర్ధారించి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
Next Story