కష్టాల్లో ఢిల్లీ.. వేడిగాలులు, నీటి సంక్షోభం, ఇప్పుడు విద్యుత్తు సంక్షోభం

by Gopi |
కష్టాల్లో ఢిల్లీ.. వేడిగాలులు, నీటి సంక్షోభం, ఇప్పుడు విద్యుత్తు సంక్షోభం
X

దిశ, నేషనల్ బ్యూరో: తీవ్ర వేడిగాలులు, నీటి సంక్షోభంతో ఇప్పటికే కష్టాల్లో ఉన్న దేశ రాజధాని ఢిల్లీకి మరో దెబ్బ తగిలింది. రాజధాని ప్రాంతంలో విద్యుత్ కోతలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తాగునీటికే అష్టకష్టాలు పడుతున్న నగరవాసులకు కరెంట్ కష్టం మరింత తీవ్ర సమస్యగా మారింది. దేశ రాజధానికి 1,500 మెగావాట్ల విద్యుత్‌ సరఫరా చేసే యూపీలోని మండోలాలో ఉన్న విద్యుత్‌ గ్రిడ్‌లో మంటలు చెలరేగడంతో నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్‌ కోతలు ఉన్నాయని ఢిల్లీ విద్యుత్‌ మంత్రి అతిషి తెలిపారు. అగ్నిప్రమాదం కారణంగా సబ్‌స్టేషన్ కాలిపోవడంతో ఢిల్లీకి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తక్షణం కేంద్రం తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి డిమాండ్ చేశారు. ఈ సమస్యపై కొత్తగా బాధ్యతలు చేపట్టిన కేంద్ర మంత్రి మనోహర్ లాల్ కట్టర్‌ను కలిసి సమస్య గురించి వివరిస్తానని ఆమె పేర్కొన్నారు. మరోవైపు మంగళవారం ఢిల్లీలో తీవ్రమైన 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అధిక వేడిగాలుల కారణంగా పిల్లలు, వృద్ధుల పరిస్థితి ఇబ్బందికరంగా మారింది.

Next Story

Most Viewed