ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు: 43 సిమ్ కార్డులు మార్చిన సిసోడియా!

by Disha Web Desk 2 |
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు: 43 సిమ్ కార్డులు మార్చిన సిసోడియా!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో దర్యాప్తు సంస్థలు దూకుడు పెంచాయి. అనేక ట్విస్టులు తీసుకుంటున్న ఈ కేసులో తాజాగా ఈడీ వర్గాలు మరో సంచలన విషయాన్ని వెల్లడించాయి. ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా 14 వేర్వేరు మొబైల్ ఫోన్లలో 43 సిమ్ కార్డులు ఉపయోగించినట్లు తెలిపాయి. వీటిలో 5 సిమ్ కార్డులు మాత్రమే సిసోడియా పేరుతో ఉండగా మిగతావి ఇతరుల పేర్ల మీద ఉన్నట్లు వెల్లడించింది. సిసోడియా ధ్వంసం చేసిన 14 మొబైల్ ఫోన్‌ల నిజమైన యజమానుల సమాచారాన్ని ఈడీ సేకరించింది.

ఈ ఫోన్లను దేవేందర్ శర్మ, సుధీర్ కుమార్, జావేద్ ఖాన్ మరియు రొమాడో క్లాత్స్ అనే కంపెనీలు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ఇందులో రోమాడో క్లాత్స్ కొనుగోలు చేసిన ఫోన్ బిల్ కోసం ఇచ్చిన చెక్ బౌన్స్ అయిందని ఈ వ్యవహారంపై కేసు కూడా నమోదైనట్లు ఈడీ తెలిపింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ స్వాధీనం చేసుకున్న ఫోన్‌కు ముందు ఉపయోగించిన ఫోన్ విరిగిపోయిందని ఇప్పుడు అది తన వద్ద లేదని పాడైన ఫోన్ ఇప్పుడు ఎక్కడ ఉందో తనకు గుర్తు లేదని సిసోడియా ఈడీకి చెప్పినట్లు ఈడీ వర్గాలు పేర్కొన్నాయి. అయితే సిసోడియా 11 నెలలుగా ఐఫోన్ 13 మ్యాక్స్ ప్రో ను ఉపయోగిస్తున్నారని, ఎల్-జి ఆర్డర్ చేసిన వెంటనే దానిని నాశనం చేశారని వెల్లడించాయి.

Next Story