Delhi Liquor Scam: నేడు తీహార్ జైలుకు సీఎం కేజ్రీవాల్‌కు తరలింపు.. ఆ మూడు పుస్తకాలు ఇప్పించాలని కోర్టుకు విన్నపం

by Shiva Kumar |
Delhi Liquor Scam: నేడు తీహార్ జైలుకు సీఎం కేజ్రీవాల్‌కు తరలింపు.. ఆ మూడు పుస్తకాలు ఇప్పించాలని కోర్టుకు విన్నపం
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు రౌస్ అవెన్యూ కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో ఏప్రిల్ 15 వరకు జ్యుడిషియల్ రిమాండ్‌లో భాగంగా కేజ్రీవాల్ జైలులో ఉండనున్నారు. కేజ్రీవాల్‌ను తీహార్ జైలుకు తరలించాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు సీఎంను తీహార్ జైలుకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు కేజ్రీవాల్‌ను జైల్లో తనకు స్పెషల్ డైట్ ఆహారంతో పాటు మందులు, పుస్తకాలు లాంటివి ఇప్పించాలని కోర్టును కోరారు.

అదేవిధంగా ప్రత్యేకంగా మూడు పుస్తకాలు కావాలంటూ కోర్టుకు ఆయన తరుఫు న్యాయవాది దరఖాస్తును అందజేశారు. ఆ మూడు పుస్తకాల్లో రామాయణం, భగవద్గీత, జర్నలిస్టు నీరజా చౌదరీ రాసిన హౌ ప్రైమ్ మినిస్టర్ డిసైడ్ పుస్తకాలు జైల్లో అందుబాటులో ఉంచాలని కోరారు. అదేవిధంగా తనను బంధించే గిలో ఒక టేబుల్, మందులు, డైట్ ప్రకారం ఆహారం అందించాలని కోరారు. తాను రోజూ ధరించే లాకెట్‌ను వేసుకునేందుకు అనుమతించాలని కోర్టును ఆయన తరఫు న్యాయవాది కోరారు.Next Story

Most Viewed