మనీలాండరింగ్ కేసుల్లో ఆస్తుల జప్తుపై కీలక ఆదేశాలు

by Dishanational4 |
మనీలాండరింగ్ కేసుల్లో ఆస్తుల జప్తుపై కీలక ఆదేశాలు
X

దిశ, నేషనల్ బ్యూరో : మనీలాండరింగ్ (పీఎంఎల్‌ఏ) కేసు దర్యాప్తు గడువు 365 రోజులు దాటి, దానిపై ప్రాసిక్యూషన్ కంప్లయింట్ ఇంకా రాకుంటే.. జప్తు చేసిన ఆస్తిని నిందితుడికి వెనక్కి ఇచ్చేయాలని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి వ్యతిరేకంగా భూషణ్ పవర్ అండ్ స్టీల్‌కు చెందిన మాజీ ఇన్‌సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రొఫెషనల్ (ఐఆర్పీ) మహేందర్ కుమార్ ఖండేల్‌వాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. అభియోగాలను ఎదుర్కొంటున్న కంపెనీపై ప్రాసిక్యూషన్ కంప్లయింట్ రాకున్నా.. దాని ఆస్తులను అటాచ్‌మెంట్ చేయడం, స్వాధీనం చేసుకోవడం, స్తంభింపజేయడం అనేది క్రూరమైన చర్య అని పేర్కొంది. భూషణ్ స్టీల్‌‌పై ఈడీ రైడ్స్ చేసిన టైంలో స్వాధీనం చేసుకున్న పత్రాలు, రికార్డులు, ఆభరణాలను మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని సెక్షన్ 8(3) ప్రకారం నిలుపుదల చేయాలని అడ్జుడికేటింగ్ అథారిటీ 2021 ఫిబ్రవరి 10న ఉత్తర్వులు ఇచ్చింది. వాటిని భూషణ్ స్టీల్‌‌ కంపెనీ ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేయగా.. విచారించిన జస్టిస్ చావ్లా ధర్మాసనం పైఆదేశాలను జారీ చేసింది.

Next Story