- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- కార్టూన్
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- Bigg Boss Telugu 7
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
- ICC World Cup 2023
అంతకు మించి ఖర్చు పెట్టొద్దు.. పాఠశాల ఎగ్జామ్ బడ్జెట్ తగ్గించిన ప్రభుత్వం..

దిశ, వెబ్‌డెస్క్: విద్య, వైద్యం ప్రజల మౌలిక వసతుల్లో ఒకటని చెప్పే నమ్మే ప్రభుత్వాల్లో ఢిల్లీ ప్రభుత్వం ఒకటి. విద్యార్థులకు అందించాల్సిన ప్రాథమిక హక్కు విద్య అని కూడా కేజ్రీవాల్ ప్రభుత్వం అనేక సందర్భాల్లో పేర్కొంది. అయితే ఈ క్రమంలోనే తాజాగా కేజ్రీవాల్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాల్లో పరీక్షల బడ్జెట్‌ను భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇకపై పరీక్షల బడ్జెట్ కేవలం రూ.90 ఉండనున్నట్లు ప్రకటించింది. 2022-23 విద్యాసంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించే పరీక్ష బడ్జెట్‌ను రూ.125 నుంచి రూ.90కు తగ్గిస్తున్నట్లు తాజాగా తెలిపింది. ఈ మేరకు విషయాన్ని విద్యాశాఖ అధికారి వెల్లడించారు.
'ఎడ్యుకేషన్ డైరెక్టరేట్‌లోని అన్ని ప్రభుత్వ పాఠశాలల అధిపతులకు బడ్జెట్ కేటాయింపు గురించి అత్యవసర గమనిక. 2022-23 విద్యాసంవత్సరంలో తరగతి 1 నుంచి 11 వరకు పరీక్షలు నిర్వహించేందుకు ఒక్కో విద్యార్థికి చేసే ఖర్చును రూ.125 నుంచి రూ.90కి తగ్గించడం జరిగింది' అని తన సర్క్యులర్‌లో ఎద్యుకేషన్ డైరెక్టర్ పేర్కొంది. అంతేకాకుండా ఈ ఏడాది బడ్జెట్ లోటు కారణంగా ఒక్కో విద్యార్థికి పరీక్ష నిర్వహించేందుకు చేసే ఖర్చును రూ.125 నుంచి తగ్గించి రూ.90 చేశామని, కాబట్టి ప్రతి పాఠశాల అధిపతి కూడా ఈ ఖర్చు రూ.90 దాటకుండా చూసుకోవాలని సూచించారు.
దాంతో పాటుగా ఇందుకోసం అధిక బడ్జెట్ డిమాండ్ స్వీకరించబడదని పేర్కొంది. 'ప్రతి వస్తువు ధర రోజురోజుకూ పెరుగుతోంది. ఈ కారణంగా విద్య రంగంలో ప్రభుత్వం మరింత బడ్జెట్ కోతలు చేయనుంది. ఇది ప్రభుత్వ పాఠశాలల ముందున్న మరో సమస్య' అని ప్రభుత్వ పాఠశాల ఉపాద్యాయుల అసోసియేషన్ జిల్లా సెక్రటరీ శాంత్ రామ్ అన్నారు.