- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
Delhi Elections: ఇదేంటి..? ఆప్ నేతలకు న్యూఢిల్లీ కాంగ్రెస్ అభ్యర్థి సూటి ప్రశ్న

దిశ, వెబ్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల(elhi Assembly Elections) జోరు కొనసాగుతోంది. ఢిల్లీ పీఠం దక్కించుకోవాలని ప్రధాన పార్టీలు(Main Parties) తీవ్ర స్థాయిలో శ్రమిస్తున్నాయి. పోటీలో ఉన్న అభ్యర్థులు నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారాలు నిర్వహిస్తూ.. ప్రత్యర్థులపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆప్ నేత కేజ్రీవాల్ ప్రత్యర్థి(Aravind kejrival Opponent), న్యూఢిల్లీ కాంగ్రెస్ అభ్యర్థి(News Delhi Congress Candidate) సందీప్ దీక్షిత్(Sandeep Deekshith) మాట్లాడుతూ మీడియాతో మాట్లాడుతూ.. ఆమ్ ఆద్మీ పార్టీ(AAP)పై ఫైర్ అయ్యారు. ఎన్నికల ప్రచారం కోసం దేశంలో ఎక్కడి నుండైనా ప్రజలు రావచ్చని, మా స్నేహితులు కూడా బయటి నుండి వచ్చారని చెప్పారు. కానీ ఆప్ ప్రభుత్వమే ఉన్నా బయటి వ్యక్తులను మాత్రమే ప్రచారానికి ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు.
పంజాబ్ పోలీసు వాహనాలు(Panjab police Vehicles) మీకు ఎందుకు ఎస్కార్ట్ కల్పిస్తున్నాయని ప్రశ్నించారు. ఇది ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయడమేనని మండిపడ్డారు. దీనిపై విచారణ చేయమని తాను పదే పదే చెబుతున్నాను అని, అయినా పట్టించుకోవడం లేదన్నారు. పంజాబ్ ప్రభుత్వం, పంజాబ్ పోలీసు వాహనాలు ఇక్కడ ఏమి చేస్తున్నారని, వారు ఎలా ప్రచారం చేస్తారని నిలదీశారు. ఎన్నికల వేళ పంజాబ్ పోలీసుల వాహనాలు, పంజాబ్ ప్రభుత్వ వాహనాలు ఢిల్లీకి రావొద్దని అన్నారు. అన్ని రాష్ట్రాల నుంచి వాహనాలు ఢిల్లీకి వస్తాయి కానీ హర్యానా, యూపీ, రాజస్థాన్ పోలీసు వాహనాలు ఎందుకు కనిపించడం లేదని, పంజాబ్ పోలీసులను మాత్రమే ఎందుకు చూస్తున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంజాబ్‌లో ఎవరి ప్రభుత్వం ఉందో చెప్పాలని, మీ పోలీసు వాహనాలు ఇక్కడ ఏం చేస్తున్నాయని, దీనికి సమాధానం చెప్పండి అని ఆప్ లీడర్లను కాంగ్రెస్ నేత ప్రశ్నించారు.