బ్రేకింగ్ న్యూస్.. పార్లమెంట్ సమావేశాలకు డేట్ ఫిక్స్

by Mahesh |
బ్రేకింగ్ న్యూస్.. పార్లమెంట్ సమావేశాలకు డేట్ ఫిక్స్
X

దిశ, వెబ్ డెస్క్: 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి సంపూర్ణ మెజార్టీతో గెలుపొందింది. దీంతో కూటమి అభ్యర్థిగా మోడీ మూడోసారి ప్రధానిగా ఈ నెల 9 ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే మరో 72 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో 18‌వ లోక్ సభకు ఎన్నికైన ఎంపీలను ప్రమాణ స్వీకార కోసం పార్లమెంట్ సమావేశాలకు డేట్ ఫిక్స్ చేశారు. ఈ నెల 24 నుంచి జూలై 3 వరకు ఈ వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు కొనసాగనున్నాయి. ఇందులో జూన్ 24, 25 తేదీల్లో పార్లమెంట్ కు ఎన్నికైన సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనుండగా.. 26‌న లోక్ సభకు కొత్త స్పీకర్‌ను ఎన్నుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం 10 రోజుల పాటు సాగే ఈ సమావేశాల్లో ఎన్డీయే ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందోననే చర్యలు సాగుతుండగా.. ప్రతిపక్షాలు మాత్రం నీట్ లీకేజీపై ప్రభుత్వాన్ని నిలదీయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో పార్లమెంట్ సమావేశాలు రసవత్తరంగా సాగే అవకాశం కనిపిస్తుంది.

Next Story

Most Viewed