కుప్పకూలిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ట్రైనర్ ఎయిర్‌క్రాఫ్ట్ (వీడియో)

by Disha Web Desk 12 |
కుప్పకూలిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ట్రైనర్ ఎయిర్‌క్రాఫ్ట్ (వీడియో)
X

దిశ, డైనమిక్ బ్యూరో : కర్ణాటకలో భారత వైమానిక దళానికి చెందిన శిక్షణ విమానం కుప్పకూలింది. గురువారం బెంగళూరుకు 136 కిలోమీటర్ల దూరంలో ఉన్న చామరాజ్‌నగర్ సమీపంలో సూర్యకిరణ్ ట్రైనర్ విమానం కూలిపోయినట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ట్వీట్ చేసింది. ఈ ప్రమాదంలో విమానం కూలిన తర్వాత మంటలు చెలరేగడంతో విమానం ముక్కలైంది. ప్రమాదానికి ముందే అందులో ఉన్న ఇద్దరు పైలట్‌లు పారాచూట్ సాయంతో తప్పించుకోగలిగారు. ఇద్దరు పైలట్లకు స్వల్ప గాయాలయ్యాయని, ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. వారిలో ఒక మహిళా పైలట్ కూడా ఉన్నారు. అయితే ట్రైనర్ విమానం సాధారణ శిక్షణ సమయంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి భారత వైమానిక దళ ఉన్నతాధికారులు బోర్డు ఆఫ్ ఎంక్వైరీని విచారణకు ఆదేశించారు.

Next Story