- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- కార్టూన్
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- Bigg Boss Telugu 7
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
- ICC World Cup 2023
CPM సంచలన నిర్ణయం.. ఆదిలోనే ఇండియా కూటమికి బిగ్ షాక్..?

దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్రంలోని ఎన్డీయే కూటమిని ఓడించడమే టార్గెట్‌గా పెట్టుకున్న ప్రతిపక్ష ఇండియా కూటమికి సీపీఎం షాక్ ఇవ్వబోతున్నదా? అంటే నేషనల్ పొలిటికల్ సర్కిల్స్‌లో ఔననే సమాధానమే వస్తోంది. మోడీని ఎదుర్కోవాలంటే ఉమ్మడి అభ్యర్థిని నిలపాలని ఇండియా కూటమి నేతలు ప్రతిపాదనలు చేస్తున్న తరుణంలో సీపీఎం పార్టీ అనూహ్య నిర్ణయం తీసుకున్నట్లు నేషనల్ మీడియాలో కథనలు వెలువడుతున్నాయి. పశ్చిమ బెంగాల్, కేరళలో ఇండియా కూటమికి సీపీఎం దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఇటీవల ఢిల్లీలో జరిగిన సీపీఎం పొలిట్ బ్యూరో సమావేశంలో ఈ మేరకు నిర్ణయం జరిగినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. మరోవైపు ఇటీవల జరిగిన ఇండియా కూటమి సమన్వయ కమిటీ భేటీకి సీపీఎం దూరంగా ఉంది. ఇకపై జరిగే సమన్వయ సమావేశాలకు సైతం తమ పార్టీ తరపున ప్రతినిధులను ఎవరినీ పంపించకూడదని సీపీఎం నిర్ణయించినట్లు కథనాలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్, బీజేపీలకు సమదూరం పాటించాలని నిర్ణయించగా ఈ తాజా పరిణామం ఇండియా కూటమిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తిని పెంచుతున్నది.
ఇదిలా ఉంటే తెలంగాణలో కామ్రేడ్‌లతో పొత్తు విషయంలో సంప్రదింపులు జరుగుతున్న వేళ రాష్ట్రంలో కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా ఆదివారం వ్యాఖ్యానించారు. తెలంగాణలో సొంతగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోమని తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో ఇండియా కూటమిలో సీపీఎం విభేదిస్తే తెలంగాణలోనూ కాంగ్రెస్‌తో పొత్తుకు ఇక మార్గాలు లేనట్లే అనే సందేహాలు బలపపడుతున్నాయి.