వైరస్ వ్యాప్తి పట్ల అప్రమత్తంగా ఉండండి: మోడీ

by Hajipasha |   ( Updated:2022-12-25 11:34:00.0  )
వైరస్ వ్యాప్తి పట్ల అప్రమత్తంగా ఉండండి: మోడీ
X

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోసారి ప్రజలకు కీలక విజ్ఞప్తి చేశారు. అనేక దేశాల్లో వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా, కోవిడ్ పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నారు. మన్ కీ బాత్ రేడియో ప్రసంగంలో ఆదివారం ఆయన మాట్లాడారు. క్రిస్మస్, న్యూ ఇయర్ సమయంలో చాలా మంది ప్రజలు విహారయాత్రలో ఉన్నారు లేదా వెళతారని అన్నారు. అయితే వైరస్ వల్ల వారి ఆనందాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేయకుండా చూసుకోవడానికి మాస్కులు ధరించడం, చేతులు కడుక్కోవడం వంటి ప్రోటోకాల్‌లను అనుసరించాలని వారిని కోరారు. వైరస్‌ను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు.

మన్ కీ బాత్‌లో భారతీయ వైద్య విధానానికి అంతర్జాతీయంగా పెరిగిన ఆదరణను ప్రస్తావించారు. నమామి గంగే అభియాన్‌తో జలరాశుల సంరక్షణకు ప్రాధాన్యం కల్పించామని చెప్పారు. కర్ణాటకలో తమలాపాకు ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్ డిమాండ్ ఉందని అన్నారు. వచ్చే ఏడాది 100 ఎపిసోడ్ దిశగా ముందుకు కదులుతున్నామని చెప్పారు. దీనికి సంబంధించి సూచనలు చేయాలని తెలిపారు. ప్రజలకు 2023 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

Advertisement

Next Story

Most Viewed