- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- కార్టూన్
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- Bigg Boss Telugu 7
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
- ICC World Cup 2023
Coromandel express accident: ఒడిషాకు ప్రధాని మోడీ.. రైలు ప్రమాద ఘటన స్థలాన్ని పరిశీలించనున్న పీఎం!

దిశ, వెబ్‌డెస్క్: ఒడిషాలో కోరమండల్ రైలు ఘోర ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టడంతో అత్యంత ఘోర ప్రమాదం జరిగింది. శుక్రవారం రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటనలో గంట గంటకు మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటికే దాదాపు 270 మంది మరణించగా.. మరో 900 మంది గాయపడినట్లు సమాచారం. అంతేకాకుండా రైలు బోగీల్లో మరో 500 మంది ప్రయాణికులు చిక్కుకున్నట్లు తెలుస్తోంది.
ఘటన స్థలంలో సహయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా.. కోరమండల్ రైలు ప్రమాద ఘటనపై ఇప్పటికే ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించిన ప్రధాని మోడీ.. ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించేందుకు ఒడిషాకు వెళ్లనున్నారు. ఒడిషాలోని కటక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రైలు ప్రమాద క్షతగ్రాతులను ఆయన పరామర్శించనున్నారు. అంతేకాకుండా రైలు ప్రమాద ఘటన స్థలాన్ని కూడా ప్రధాని మోడీ పరిశీలించనున్నారు. దీంతో ప్రధాని రాక సందర్భంగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇక, ఈ ప్రమాదంలో మృతుల మరింత పెరిగి అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. కాగా, ఈ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రైల్వే శాఖ రూ. 10 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించగా.. తీవ్రంగా గాయపడిన వారికి రూ. 2 లక్షలు, స్వల్పంగా గాయపడ్డవారికి రూ.50 వేలు ఎక్స్ గ్రేషియా ఎనౌన్స్ చేశారు.
.Also Read..
Coromandel express accident : కోరమాండల్ రైలు ప్రమాదం.. కాంగ్రెస్ నేతలకు ఖర్గే కీలక సందేశం