Sam Pitroda : భారత జర్నలిస్టుకు శాం పిట్రోడా క్షమాపణలు.. ఎందుకంటే ?

by Hajipasha |
Sam Pitroda : భారత జర్నలిస్టుకు శాం పిట్రోడా క్షమాపణలు.. ఎందుకంటే ?
X

దిశ, నేషనల్ బ్యూరో : ఇటీవలే అమెరికాలో ఓ భారతీయ మీడియా సంస్థ జర్నలిస్టుపై కాంగ్రెస్ శ్రేణులు దాడికి పాల్పడిన వ్యవహారంపై ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్షుడు శాం పిట్రోడా స్పందించారు. దాడికి గురైన జర్నలిస్టు రోహిత్ శర్మకు ఆయన వ్యక్తిగత క్షమాపణలు తెలిపారు. సదరు జర్నలిస్టుకు ఫోన్ చేసి ఆయన సారీ చెప్పారు. ఈ దాడికి కారకులైన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మీడియా స్వేచ్ఛకు కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని పిట్రోడా తెలిపారు.

జర్నలిస్టులపై దాడి ఘటనలను సహించేది లేదని స్పష్టం చేశారు. ‘‘బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడుల అంశాన్ని అమెరికా చట్టసభ సభ్యులతో జరిగే సమావేశంలో రాహుల్ గాంధీ ప్రస్తావిస్తారా?’’ అని శాం పిట్రోడాను జర్నలిస్టు రోహిత్ శర్మ ప్రశ్నించారు. ఈ ప్రశ్నపై అభ్యంతరం తెలుపుతూ దాదాపు 15 మంది కాంగ్రెస్ కార్యకర్తలు తనను తీసుకెళ్లి ఓ గదిలో బంధించారని రోహిత్ పేర్కొన్నారు. వీడియో నుంచి ఆ ప్రశ్నను డిలీట్ చేయమని తనను బెదిరించారని చెప్పారు. కాగా, ఇటీవలే కశ్మీర్‌‌‌లోని దోడాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఈ అంశాన్ని ప్రధాని మోడీ ప్రస్తావించారు.

Advertisement

Next Story

Most Viewed