కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో బలాన్ని పెంచడానికి కీలక సవరణలు!

by Disha Web Desk 13 |
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో బలాన్ని పెంచడానికి కీలక సవరణలు!
X

న్యూఢిల్లీ: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో బలాన్ని పెంచడానికి కీలక సవరణలు!దీనిలో పార్టీ అత్యున్నత నిర్ణయాధికార సంస్థ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) బలాన్ని పెంచడానికి కీలక సవరణలకు సిద్దమైనట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. దీనిలో ప్రధానంగా వర్కింగ్ కమిటీలో 50 శాతం రిజర్వేషన్లను కూడా అమల్లోకి తీసుకొచ్చేలా సన్నాహాలు చేస్తుంది.

అంతేకాకుండా ఎన్నికలు నిర్వహించకుండా.. సభ్యులు ఏకాభిప్రాయంతో ఎంపిక చేయనున్నట్లు వర్గాలు పేర్కొన్నాయి. నిర్ణయాధికార సంస్థ సంఖ్యను 24 నుంచి 28 పెంచడమే కాకుండా మాజీ ప్రధాని, మాజీ పార్టీ అధ్యక్షులను జాబితాలో ఉంచనుంది. అదనంగా ఎస్సీ, ఎస్టీ, ఇతర వెనుకబడిన తరగతులు, మైనార్టీలు, యువత, మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించనున్నట్లు తెలిపాయి.

-దీనిపై ఈ నెల 24 నుంచి 26 మధ్య ఛత్తీస్‌గఢ్ రాయ్‌పూర్‌లో జరిగే ప్లీనరి సెషన్ కొత్త అధ్యక్షుడి ఆధ్వర్యంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. రాష్ట్ర యూనిట్లు ఆమోదించిన తీర్మానాల ప్రకారం.. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యులను రూపొందించడానికి కాంగ్రెస్ అధ్యక్షుడికి అధికారం ఉంది. కాంగ్రెస్ కార్యవర్గ కమిటీ సభ్యులను ఎన్నుకోవడానికి 8,800 ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యుల నుండి 1,100 మంది AICC సభ్యులను తీసుకున్నారు.

ఇంతకుముందు సీడబ్ల్యూసీలో సభ్యులు 23+1(కాంగ్రెస్ అధ్యక్షుడిగా) ఉండగా ఇకపై 23+5(కాంగ్రెస్ అధ్యక్షుడు, పార్టీ పార్లమెంటరీ చైర్ పర్సన్, మాజీ ప్రధాని, మాజీ అధ్యక్షుడు, లోక్‌సభ- రాజ్యసభ విపక్ష నేత ఉండే అవకాశం ఉంది.

Next Story