జమిలి ఎన్నికలపై కాంగ్రెస్ సంచలన నిర్ణయం

by M.Rajitha |
జమిలి ఎన్నికలపై కాంగ్రెస్ సంచలన నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్ : జమిలి(Jamili) ఎన్నికలపై నేడు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసిన సంగతి తెలిసిందే. బుధవారం ఏర్పాటైన ప్రత్యేక సమావేశంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. జమిలి ఎన్నికల మీద కేంద్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక కమిటీ మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో తన నివేదికను కేంద్రానికి అందజేసింది. ఆ వెంటనే కేబినెట్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి, బిల్లును ఆమోదిస్తునట్టు తెలిపింది. కాగా వన్ నేషన్ - వన్ ఎలక్షన్(One Nation - One Election)పై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్(Congress) తీవ్రంగా వ్యతిరేకించింది. పార్లమెంటు లో బిల్లు పెడితే ఖచ్చితంగా ఓడిస్తామని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం ఏక పక్ష నిర్ణయాన్ని మేము స్వాగతించడం లేదని వెల్లడించింది. కాగా మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును రానున్న శీతాకాల సమావేశాల్లో పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు సిద్దమవుతోంది.



Next Story

Most Viewed