ఉద్ధవ్ శివసేనకు కాంగ్రెస్ షాక్

by srinivas |
ఉద్ధవ్ శివసేనకు కాంగ్రెస్ షాక్
X
  • 23 ఎంపీ సీట్ల డిమాండ్‌ తిరస్కరణ
  • ఎన్సీపీ, శివసేన చీలిపోయి బలహీనపడ్డాయంటున్న హస్తం పార్టీ నేతలు

ముంబై: మహారాష్ట్రలో మిత్రపక్షం శివసేన (ఉద్ధవ్‌)కు కాంగ్రెస్‌ షాక్ ఇచ్చింది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 23 సీట్లలో పోటీ చేస్తామంటూ శివసేన చేసిన డిమాండ్‌‌కు కాంగ్రెస్‌ నో చెప్పింది. మహారాష్ట్ర వికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటమిలోని భాగస్వామ్య పార్టీలైన కాంగ్రెస్‌, ఎన్సీపీ (శరద్ పవార్), శివసేన (ఉద్ధవ్) నేతలు సమావేశమై లోక్‌సభ సీట్ల పంపకంపై చర్చించారు. ఈ సందర్భంగా మహారాష్ట్రలోని మొత్తం 48 పార్లమెంటు స్థానాలకుగానూ 23 చోట్ల పోటీ చేస్తామని ఉద్ధవ్‌ వర్గం శివసేన నేతలు ప్రతిపాదించారు.

అయితే అందుకు కాంగ్రెస్ నేతలు నిరాకరించారు. ఎంవీఏ కూటమిలోని ఎన్సీపీ (శరద్ పవార్), శివసేన (ఉద్ధవ్)లు చీలిపోయి బలహీనమయ్యాయని.. ప్రస్తుతం స్థిరమైన ఓటుబ్యాంకుతో బలమైన రాజకీయ పక్షంగా తమ పార్టీ మాత్రమే మిగిలిందని హస్తం పార్టీ లీడర్లు వాదించారని తెలుస్తోంది. ‘‘శివసేన 23 సీట్లను డిమాండ్ చేస్తోంది. కానీ ఆ సీట్లను ఏం చేస్తారు?. శివసేన నుంచి చాలామంది నాయకులు వెళ్లిపోయారు. దీంతో ఆ పార్టీలో సంక్షోభం ఏర్పడింది. అభ్యర్థుల కొరతే ఇప్పుడు శివసేనకు పెద్ద సమస్య’’ అని కాంగ్రెస్ నాయకుడు సంజయ్ నిరుపమ్ కామెంట్ చేశారు. ‘‘శివసేన ఓవర్‌గా సీట్లను అడుగుతోంది. 23 సీట్లు అడగడం అంటే చాలా పెద్ద విషయం’’ అని కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ చవాన్ పేర్కొన్నారు.

Next Story

Most Viewed