రాజస్థాన్ తదుపరి సీఎంగా సచిన్ పైలట్!

by Disha Web Desk 21 |
రాజస్థాన్ తదుపరి సీఎంగా సచిన్ పైలట్!
X

జైపూర్: రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రేసులో ఉన్నారన్న వార్తల నేపథ్యంలో సీఎం పదవికి సచిన ఫైలట్ పేరు ప్రస్తావనకు వచ్చింది. అశోక్ గెహ్లట్ తర్వాత అధిష్టానానికి సన్నిహితుడిగా పేరున్న సచిన్‌కే ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. వాస్తవానికి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తే సచిన్‌కే సీఎంగా బాధ్యతలు ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే తాజాగా గెహ్లట్ పార్టీ అధ్యక్ష పదవికి పోటీలో దిగబోతున్నారనే వార్తల నేపథ్యంలో సచిన్ తర్వాతి సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తారని భావిస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ అధిష్టానం ఒక వ్యక్తికి ఒక పదవికి కట్టుబడి ఉండడంతో అధ్యక్ష బరిలోకి దిగాలంటే గెహ్లట్ తప్పనిసరిగా బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది.

బుధవారం కాంగ్రెస్ అధినేత్రి సోనియాతో గెహ్లట్ భేటీ కావడంతో ఆయన బరిలో ఉన్నారనే హింట్ ఇచ్చారని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే సోనియా ఎన్నికల్లో తటస్థ వైఖరిని అవలంబిస్తూ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని రాజస్థాన్ సీఎంకు సూచించారు. ఒకవేళ గెహ్లట్ బరిలోకి దిగితే సచిన్ తర్వాతి సీఎం రేసులో ప్రథమ వరుసలో ఉంటారు. వాస్తవానికి 2020లో గెహ్లట్‌కు వ్యతిరేకంగా ఫైలట్‌తో కూడిన 19 మంది ఎమ్మెల్యేల బృందం తిరుగుబావుటా ఎగురవేసింది. అధిష్టానం కలగజేసుకుని నచ్చజెప్పడంతో సీఎం గెహ్లట్‌కు ఫైలట్ మద్దతిచ్చారు. ఇద్దరి మధ్య అంతర్గత కలహాలు అప్పుడుప్పుడు బయటపడుతూనే ఉన్నాయి.

Next Story