కాంగ్రెస్ గ్యారెంటీలు ఫేక్.. ర‌మ‌ణ్ సింగ్‌

by Disha Web Desk 13 |
కాంగ్రెస్ గ్యారెంటీలు ఫేక్.. ర‌మ‌ణ్ సింగ్‌
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్ధానాలు అన్నీ ఫేక్ అని చ‌త్తీస్‌ఘ‌డ్ బీజేపీ నేత ర‌మ‌ణ్ సింగ్ అన్నారు. ఆ రాష్ట్రంలో ప్రస్తుతం బీజేపీ లీడింగ్‌లో ఉన్నది. తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయ‌నున్నట్లు ఆయ‌న వెల్లడించారు. సీఎం భూపేశ్ భ‌గేల్.. త‌మ వాగ్దానాల‌ను అమ‌లు చేయ‌లేద‌ని ఆరోపించారు. ప్రధాని మోదీ ఇచ్చిన గ్యారెంటీల‌ను ప్రజ‌లు నమ్మార‌ని, అందుకే త‌మ పార్టీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన‌ట్లు ఆయ‌న చెప్పారు. చ‌త్తీస్‌ఘ‌డ్‌తో పాటు మ‌ధ్యప్రదేశ్‌, రాజ‌స్థాన్‌లో త‌మ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయ‌నున్నట్లు ఆయ‌న తెలిపారు. ఎన్నిక‌ల ట్రెండ్స్‌ను గ‌మ‌నిస్తే, బీజేపీకి మ‌ద్దతు క్లియ‌ర్‌గా ఉంద‌న్నారు. ప్రజ‌ల్లో ఉన్న ఆగ్రహం.. ఓటింగ్‌లో క‌నిపించింద‌న్నారు. చ‌త్తీస్‌ఘ‌డ్‌లోని ప‌ట్టణాలు, గ్రామాలు అన్నీ బీజేపీ వైపే నిలిచిన‌ట్లు చెప్పారు.

Next Story

Most Viewed