దేశవ్యాప్తంగా కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీలు

by Dishanational5 |
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీలు
X

దిశ, నేషనల్ బ్యూరో: త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగానే సరైన అభ్యర్థుల ఎంపిక కోసం దేశవ్యాప్తంగా స్క్రీనింగ్ కమిటీలను ఏర్పాటు చేసింది. అన్ని రాష్ట్రాలు, యూటీలను ఐదు క్లస్టర్లుగా పరిగణించిన కాంగ్రెస్.. ఒక్కో క్లస్టర్‌కు ఒక చైర్మన్, ఇద్దరు సభ్యులతో కూడిన స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలను పార్టీ జనరల్ సెక్రెటరీ వేణుగోపాల్ ఓ ప్రకటన ద్వారా శుక్రవారం వెల్లడించారు. స్క్రీనింగ్ కమిటీలు తక్షణమే అమల్లోకి వస్తాయని పార్టీ చీఫ్ ఖర్గే వెల్లడించినట్టుగా పేర్కొన్నారు.

క్లస్టర్-1

తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, లక్షద్వీప్, పుదుచ్చెరీలు క్లస్టర్-1 పరిధిలోకి రానుండగా, ఆయా రాష్ట్రాలకు స్క్రీనింగ్ కమిటీ చైర్మన్‌గా హరీశ్ చౌదరీ నియామకవ్వగా, జిగ్నేశ్ మేవానీ, విశ్వజిత్ కదం సభ్యులుగా ఉంటారు.

క్లస్టర్-2

క్లస్టర్-2 పరిధిలోకి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గోవా, ఒడిశా, అండమాన్ నికోబర్ దీవులు రానుండగా, వీటికి చైర్మన్‌గా మధుసూదన్ మిస్త్రీ, సభ్యులుగా ఉంటారు.

క్లస్టర్-3

గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, ఢిల్లీ, డామన్ డయ్యూ, దాద్రా నగర్ హవేలీలు క్లస్టర్-4 పరిధిలోకి రానుండగా, వీటి స్క్రీనింగ్ కమిటీ చైర్మన్‌గా రజనీ పాటిల్, సభ్యులుగా క్రిష్ణ అల్లవూరు, పర్గత్ సింగ్ ఉంటారు.

క్లస్టర్-4

క్లస్టర్-4 పరిధిలోకి ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, చండీగఢ్, జమ్మూ కశ్మీర్, లడఖ్ రానుండగా, వీటికి భక్త చరణ్ దాస్ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. కమిటీ సభ్యులుగా నీరజ్ దంగీ, యశోమతి థాకూర్ ఉంటారు.

క్లస్టర్-5

బిహార్, జార్ఖండ్, బెంగాల్, అసోం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మిజోరం, మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర, సిక్కిం రాష్ట్రాలు క్లస్టర్-5 పరిధిలోకి రానుండగా, ఈ రాష్ట్రాల స్క్రీనింగ్ కమిటీ చైర్మన్‌గా రానా కేపీ సింగ్, సభ్యులుగా జైవర్ధన్ సింగ్, ఇవాన్ డిసౌజా నియామకమయ్యారు. కాగా, ఈ స్క్రీనింగ్ కమిటీలు నియోజకవర్గాల వారీగా ఎంపీ అభ్యర్థుల పేర్లను పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి ప్రతిపాదించనున్నాయి. ఇదిలా ఉండగా, స్క్రీనింగ్ కమిటీలతోపాటు ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా అల్కలాంబ, ఎన్ఎస్‌యూఐ అధ్యక్షుడిగా వరుణ్ చౌదరీని నియమిస్తూ పార్టీ చీఫ్ ఖర్గే నిర్ణయం తీసుకున్నారు.




Next Story

Most Viewed