డిసెంబర్ 6న ఇండియా కూటమి సమావేశం

by Prasanna |
డిసెంబర్ 6న ఇండియా కూటమి సమావేశం
X

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్స్ లాంటి కీలక రాష్ట్రాల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కాంగ్రెస్ కీలక ప్రకటన విడుదల చేసింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో బీజేపీ మ్యాజిక్ ఫిగర్‌ను దాటి, ఛాత్తీస్‌గఢ్‌లో అధికార కాంగ్రెస్‌ను అధిగమించి ముందంజలో ఉంది. ఈ క్రమంలో విపక్ష కూటమి 'ఇండియా' భాగస్వామ్య నేతలతో డిసెంబర్ 6న ఢిల్లీలో సమావేశం అయ్యేందుకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఈ మేరకు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గె ఆదివారం ప్రకటనలో తెలిపారు. డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్‌తో సహా కూటమి భాగస్వాములకు ఫోన్ చేసి సమావేశం గురించి తెలియజేసినట్టు పేర్కొన్నారు. ఈ ఎన్నికల ఫలితాలు 2024 లోక్‌సభ ఎన్నికలకు కీలకం కావడంతో ఇండియా కూటమి సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. చివరిసారిగా ఇండియా కూటమి ముంబైలో సమావేశమైంది. రెండు రోజుల చర్చల సందర్భంగా ఇండియా కూటమి విజయం కోసం 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగస్వామ్య పార్టీలన్నీ కలిసి పోరాడాలని మూడు పాయింట్ల తీర్మానాన్ని ఆమోదించింది.



Next Story

Most Viewed