సుప్రీం కోర్టు తదుపరి చీఫ్ జస్టిస్‌గా గవాయ్ పేరును ప్రతిపాధించిన కొలిజియం

by Mahesh |   ( Updated:2025-04-16 09:20:36.0  )
సుప్రీం కోర్టు తదుపరి చీఫ్ జస్టిస్‌గా గవాయ్ పేరును ప్రతిపాధించిన కొలిజియం
X

దిశ, వెబ్ డెస్క్: సుప్రీం కోర్టు తదుపరి చీఫ్ జస్టిస్‌గా భూషణ్ రామ్‌కృష్ణ గవాయ్ (Justice B.R. Gavai) భాద్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు ఈ రోజు సుప్రీం కోలీజీయం (Supreme Collegium) ఆయన పేరును తదుపరి చీఫ్ జస్టిస్‌గా ప్రతిపాధించింది. కాగా ప్రస్తుతం సుప్రీం కోర్టు చీఫ్ జస్టీస్ (Chief Justice of the Supreme Court) గా ఉన్న సంజీవ్‌ ఖన్నా మే 13న రిటైర్‌ కానున్నారు. అనంతరం గవాయ్ తదుపరి చీఫ్ జస్టిస్‌గా భాద్యతలు చేపట్టనున్నారు. ఇదిలా ఉంటే జస్టిస్ భూషణ్ రామ్‌కృష్ణ గవాయ్ (Justice Bhushan Ramkrishna Gavai) ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు. ఆయన 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. సీనియారిటీ ప్రకారం.. ప్రస్తుత చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా 2025 మే 13న రిటైర్ అయిన తర్వాత, జస్టిస్ గవాయ్ 52వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయన 2025 మే 14 నుంచి 2025 నవంబర్ 23 వరకు (సుమారు 6 నెలలు) ఈ పదవిలో కొనసాగుతారు.

జస్టిస్ B.R. గవాయ్ గురించి

జస్టిస్ గవాయ్ 1985లో న్యాయవాదిగా బాధ్యతలు చేపట్టారు. బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్‌లో ప్రాక్టీస్ చేశారు. 2003లో బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2019లో సుప్రీంకోర్టు ఎలివేట్ అయ్యారు. జస్టిస్ గవాయ్ 150కి పైగా తీర్పులు ఇచ్చారు. ఇందులో ముఖ్యంగా.. క్రిమినల్, సర్వీస్, ప్రాపర్టీ, ఎన్విరాన్‌మెంట్ కేసులు ఉన్నాయి. అలాగే ఆయన డీమోనిటైజేషన్, వన్నియార్ రిజర్వేషన్ కేసు వంటి ముఖ్యమైన తీర్పులలో భాగమయ్యారు. జస్టిస్ గవాయ్ షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారు.

Next Story

Most Viewed