సుప్రీంకోర్టు జడ్జిగా ఏపీ సీజే!

by Disha Web Desk 13 |
సుప్రీంకోర్టు జడ్జిగా ఏపీ సీజే!
X

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, సీనియర్ అడ్వకేట్ కేవీ విశ్వనాథన్‌లకు సుప్రీంకోర్టు జడ్జీలుగా పదోన్నతులు కల్పించాలని కోరుతూ వారి పేర్లను సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని కొలీజియం మంగళవారం కేంద్రానికి సిఫార్సు చేసింది. కొలీజియం సిఫార్సులను కేంద్రం ఆమోదిస్తే గనుక సీనియారిటీ ఆధారంగా విశ్వనాథన్ 2030 ఆగస్టులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)గా బాధ్యతలు చేపడతారు.

సీజేఐ పదవిలో 2031 మే 25వరకు కొనసాగుతారు. కాగా, సుప్రీంకోర్టులో 34 మంది జడ్జీలు ఉండాల్సి ఉండగా, గత రెండు రోజుల్లోనే వరుసగా జస్టిస్ దినేశ్ మహేశ్వరి, జస్టిస్ షా పదవీ విరమణ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ సంఖ్య ప్రస్తుతం 32కు తగ్గింది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు కొలీజియం కొత్తగా ఇద్దరి పేర్లను కేంద్రానికి సిఫార్సు చేసింది.



Next Story

Most Viewed